High Tension Bandi Padayatra: బండి పాదయాత్రపై హైటెన్షన్.. జనగామలో రాళ్ల దాడి!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
- Author : Balu J
Date : 15-08-2022 - 1:34 IST
Published By : Hashtagu Telugu Desk
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. ఇవాళ జనగామ జిల్లాలో పాదయాత్రలో భాగంగా దేవరుప్పుల గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతుండగా, టీఆర్ ఎస్ కార్యకర్తలు అక్కడి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై బీజేపీ నాయకులను ప్రశ్నించగా, ఇరువురి మధ్య గొడవ మొదలైంది. పరస్పరం రాళ్లు విసురుకున్నారు. ఈ ఘటనలో పలువురు నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇది టీఆర్ఎస్ గూండాల దాడి అని అన్నారు.
చూసీ చూడనట్టు వ్యవహరించిన పోలీసులు వ్యవహరించారని, బీజేపీ కార్యకర్తలపైనే పోలీసుల లాఠీఛార్జ్ చేశారని బండి సంజయ్ అన్నారు. డీజీపీతో నేరుగా ఫోన్లో మాట్లాడిన బండి సంజయ్ కుమార్, కార్యకర్తల తలల పగలకొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు జీతాలు కేసీఆర్ జేబుల్లోంచి ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఉండేది ఇంకో 6 నెలలే అని, తక్షణమే పాదయాత్ర ప్రశాంతంగా కొనసాగేలా చూడండి అంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ కుటుంబానికి పదవుల కోసమా తెలంగాణ వచ్చింది.? ఉద్యమ ద్రోహులకు పదవులిచ్చిన నీచ చరిత్ర టీఆర్ఎస్ ది. 10 మంది వచ్చి పోటుగాండ్ల మాదిరిగా మాట్లాడితే, పాదయాత్రకు అడ్డుతగిలితే ఊరుకునేది లేదంటూ టీఆర్ఎస్ గుండాలకు @bandisanjay_bjp గారి ఘాటు హెచ్చరిక..#PrajaSangramaYatra3 pic.twitter.com/UoJlTb4Gcg
— BJP Telangana (@BJP4Telangana) August 15, 2022