Praja Bhavan : ప్రజా భవన్ ముందు భారీ బందోబస్తు
Praja Bhavan : తమకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారంటూ వారంతా గత కొద్దీ రోజులుగా ఆందోళన చేస్తూ..బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
- By Sudheer Published Date - 12:55 PM, Thu - 19 September 24

రుణమాఫీ (Runamafi) కాని రైతులు ప్రజా భవన్ (Praja Bhavan) ముట్టడి పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజా భవన్ ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ (CM Revanth Reddy) ప్రకటించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే ఆగస్టు 15 లోపు రెండు లక్షలున్నా వారందరికీ రుణమాఫీ చేస్తామని తేల్చి చెప్పాడు. అయితే ఆగస్టు 15 నాటికీ మూడు వంతులుగా రుణమాఫీ చేసారు. కాకపోతే 25 % మంది వరకు రెండు లక్షల రుణమాఫీ జరగడంతో మిగతా వారంతా రోడ్డెక్కారు. తమకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారంటూ వారంతా గత కొద్దీ రోజులుగా ఆందోళన చేస్తూ..బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
ఈ క్రమంలో నేడు ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ప్రజా భవన్ ముందు కూడా భారీగా పోలీసులు మోహరించి బందోబస్తు ఏర్పాటు చేసారు. ఇక రైతుల అరెస్ట్ ల ఫై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిండెంట్ కేటీఆర్ స్పందించారు. రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలని రైతులు చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన పాపానికి వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బుధవారం రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టుచేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం దారుణమైన చర్య అన్నారు. వారేమైనా దొంగలా, ఉగ్రవాదులా అని ప్రశ్నించారు. గురువారం ఉదయం నుంచి కూడా అనేక చోట్ల అన్నదాతల ఇళ్లకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకుంటున్నట్టు సమాచారం అందుతున్నదని చెప్పారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇకనైనా ఆపాలన్నారు.
రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలని రైతులు చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన పాపానికి రాష్టవ్యాప్తంగా వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం..
నిన్న రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టుచేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం దారుణమైన చర్య. వారేమైనా దొంగలా,…
— KTR (@KTRBRS) September 19, 2024
Read Also : Ganesh Immersion : హైదరాబాద్లో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం