HCA : భారత్-ఇంగ్లండ్ టెస్టు విజయవంతంగా నిర్వహిస్తాం – హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా
- Author : Prasad
Date : 19-01-2024 - 8:13 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు చెప్పారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలోని గణపతి ఆలయం, ప్రధాన పిచ్ వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో కలిసి జగన్‌మోహన్‌రావు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్ రావు మాట్లాడుతూ తొలి టెస్టు మ్యాచ్‌కు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని చెప్పారు. ఇప్పటికే దాదాపు 20 వేల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అమ్ముడయ్యాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్టేడియం పూర్తి సామర్థ్యానికి తగ్గట్టు, ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దేవ్‌రాజ్, ఉపాధ్యక్షుడు దల్జిత్ సింగ్, కోశాధికారి సీజే శ్రీనివాస్, సహాయ కార్యదర్శి బసవరాజు, స్టేడియం సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: CBN : జగనన్న బాణం రివర్స్ గేర్ లో వస్తోంది.. పులివెందుల్లో కూడా టీడీపీనే – చంద్రబాబు