Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్ ఫై హరీష్ రావు మొన్న ఆలా..నేడు ఇలా..ఎందుకో మరి..?
ఈ వయసులో ఆయనను ఇలా అరెస్ట్ చేయడం దురదృష్టకరమని హరీష్ రావు చెప్పుకొచ్చారు
- By Sudheer Published Date - 03:10 PM, Sat - 30 September 23

చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) ఫై రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఎంతో మంది స్పందించారు. ఇందులో బిఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. అయితే మంత్రి హరీష్ రావు (Harish Rao) చంద్రబాబు అరెస్ట్ ఫై రెండు విధాలుగా మాట్లాడి ప్రజలను అయోమయంలో పడేసారు.
20 రోజుల క్రితం సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. పాపం చంద్రబాబు అరెస్టైనట్టున్నారు.. దాని గురించి మాట్లాడకూడదు. గానీ గతంలో ఆయన ఎప్పుడూ ఐటీ ఐటీ అని ప్రస్తావించేవారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నానని తెలిపారు. ఈ వయసులో ఆయనను ఇలా అరెస్ట్ చేయడం దురదృష్టకరమని హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడిన చంద్రబాబు… ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించి కూడా మంచి మాటలు చెప్పారని అన్నారు.
గతంలో చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడకూడదని తెలిపిన హరీష్..ఇప్పుడు సడెన్ గా ఎందుకు ఖండించారని అంత మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం హైదరాబాద్ లో సెటిల్ అయినా ఆంధ్రప్రజలను ఉద్దేశించే అని కొంతమంది అంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రజలతో పాటు ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. అలాగే రేవంత్ రెడ్డి తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు సైతం చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ..చంద్రబాబు కోసం తెలంగాణ లో నిరసన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండించారు. ఇది ఎక్కడ బిఆర్ఎస్ కు వ్యతిరేకత వస్తుందో అని హరీష్ రావు ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారని..ఇదంతా కూడా ఆంధ్ర ఓటర్లను ఆకట్టుకునే భాగంలోనేది అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి హరీష్ రావు లాంటి కీలక నేత..చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడం ఫై టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Ration Card KYC : రేషన్ కార్డుల ఈ-కేవైసీపై అయోమయం.. లాస్ట్ డేట్ పై నో క్లారిటీ