Group-1 Mains Exams : నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్.. భారీ బందోబస్తు
Group-1 Mains Exams : పరీక్ష హాలులోకి ఎంటర్ అయ్యే అభ్యర్థులను డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేశాకే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు
- Author : Sudheer
Date : 21-10-2024 - 10:53 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టులకు సంబంధించి నేటి నుండి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు (Group-1 Mains Exams) జరగనున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాయనున్నారు. పరీక్ష హాలులోకి ఎంటర్ అయ్యే అభ్యర్థులను డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేశాకే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు నిబంధనలను (Group 1 Candidates Rules) తప్పనిసరిగా పాటించాలి.అభ్యర్థులు బ్లాక్ లేదా బ్లూ కలర్ బాల్ పాయింట్ పెన్, పెన్సిల్, రబ్బర్, హాల్ టికెట్, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా కార్డును పరీక్షా హాల్‌లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి జెల్, స్కెచ్ పెన్స్ ఉపయోగించకూడదు. హాల్ టికెట్‌పై అభ్యర్థితో పాటు ఇన్విజలేటర్ సంతకం తప్పనిసరి. ఆన్సర్ రాసేందుకు బుక్ లెట్ ఇస్తారు. అడిషనల్స్ ఇవ్వరు.
ఇక ఈ పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు నిరసనలు (Candidates protest) వ్యక్తం చేస్తుండటంతో, అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు (Arrangement) ఏర్పాటు చేశారు. పరీక్షా రూమ్, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాలలో CC కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించబడుతుంది. భద్రతను ముమ్మరంగా పెంచేందుకు, పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఐదుగురికి మించి ఉండకుండా పోలీసులు BNSS 163 సెక్షన్ విధించారు.
ఇది అభ్యర్థుల భద్రత మరియు పరీక్షా క్రమాన్ని ఉంచేందుకు తీసుకున్న చర్యలు గా చెప్పవచ్చు. ఈ చర్యల ద్వారా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించడానికి ప్రయత్నం చేయబడుతోంది. దీనితోపాటు, అభ్యర్థులు ఇబ్బందులు లేకుండా తమ పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 46 పరీక్ష కేంద్రాల వద్ద ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్ వద్ద ఒక ఎస్సై, మహిళా కానిస్టేబుల్ సహా ఆరుగురు పోలీసులు పర్యవేక్షణలో ఉంటారు.
Read Also : Terror Attack : కశ్మీరు ఉగ్రదాడి బాధ్యత మాదే : ది రెసిస్టెన్స్ ఫ్రంట్