T-SAT: టీ-సాట్‌లో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
టీ-సాట్‌లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి విజయవంతమైన నాయకత్వాన్ని కొనియాడారు.
- By Kode Mohan Sai Published Date - 04:24 PM, Fri - 8 November 24

తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు శుక్రవారం జూబ్లీహిల్స్ టి-సాట్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు, టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి, సంబరాలు జరుపుకున్నారు. బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఈ వేడుకలో పాల్గొని, “విజనరీ లీడర్ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జన్మదినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.” రేవంత్ రెడ్డి గారు ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో ఉండి, తెలంగాణ ప్రభుత్వ మరియు ప్రజల ఖ్యాతిని నలుదిశలా విస్తరింప చేసేలా పనిచేయాలని ఆకాంక్షించారు.
అనేక సంవత్సరాలుగా పోరాట నాయకుడిగా ఆయన జన్మదినోత్సవాల్లో పాల్గొన్న తాము ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయనకు జన్మదినోత్సం జరపడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేశ్, తెలంగాణ మాసపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాసరావు మరియు అనేక ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.