Gangula Kamalakar : పార్టీ మార్పు ఫై గంగుల..ఒక పిక్ తో క్లారిటీ ఇచ్చాడుగా..!!
గంగుల కమలాకర్ 29 మంది కరీంనగర్ కార్పొరేటర్లతో కలిసి బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు
- By Sudheer Published Date - 12:24 PM, Mon - 24 June 24

బీఆర్ఎస్ (BRS) పార్టీ లో ఇక లాస్ట్ కు కేసీఆర్ (KCR) ఫ్యామిలీ సభ్యులు మాత్రమే మిగులుతారా..? ప్రస్తుతం ఉన్న కొద్దీ గొప్ప ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు సీఎం రేవంత్ పక్క ప్లాన్ లో ఉన్నాడా..? అంటే అవును కావొచ్చని అంత మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణంగా వరుసగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడమే..రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుండి విజయం సాధించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు సైతం కారు దిగి హస్తం గూటికీ చేరనున్నట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఇందులో భాగంగానే, బీఆర్ఎస్ మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సైతం బీఆర్ఎస్ పార్టీని వీడుతారని ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో గంగుల ఒకే ఒక పిక్ తో ఆ వార్తలకు చెక్ పెట్టారు. గంగుల కమలాకర్ 29 మంది కరీంనగర్ కార్పొరేటర్లతో కలిసి బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ఆదివారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్, కేటీఆర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ మార్పు వార్తలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ గంగులతో పాటు ఇతర నేతలకు ధైర్యం కల్పించినట్లు తెలుస్తోంది. పార్టీ వీడొద్దని.. తెలంగాణలో భవిష్యత్ బీఆర్ఎస్‌దేనని భరోసా కల్పించినట్లు సమాచారం. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండటంతో పాటు గంగుల కూడా పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతుండటంతో అప్రమత్తమైన కేసీఆర్.. ఫామ్ హౌస్‌కు రావాలని ఆయనను పిలిచినట్లు తెలుస్తోంది. కరీంనగర్‌లో బలమైన నేతగా ఉన్న గంగుల పార్టీ మారితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్‌లోనూ కరీంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు తప్పవనే ఆలోచనతో గంగులను కేసీఆర్ కూల్ చేశారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌తో భేటీ కావడంతో ప్రస్తుతానికి అయితే గంగుల పార్టీ మార్పు వార్తలకు చెక్ పడినట్లు అయ్యింది.
2000 సంవత్సరంలో కరీంనగర్ మున్సిపాలిటీలో కార్పొరేటర్‌గా ఎన్నికైన కమలాకర్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2009లో టీడీపీ టికెట్‌పై కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2013లో తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో తెలంగాణ రాష్ట్ర సమితి(BRS)లో చేరి 2014 , 2018 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నికయ్యారు. కరీంనగర్ సాంప్రదాయకంగా వెలమ కులానికి బలమైన కోటగా పరిగణించబడుతుంది. అయితే ఇతర వెనుకబడిన తరగతి (OBC) కమ్యూనిటీకి చెందిన కమలాకర్ వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 2019లో కేసీఆర్ మంత్రివర్గంలో BC సంక్షేమం, ఆహారం & పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Read Also : CBSE Compartment: జూలై 15 నుంచి సీబీఎస్ఈ కంపార్ట్‌మెంట్ పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే..!