HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Gali Anil Kumar Joins Brs

Gali Anil Kumar : బిఆర్ఎస్ లోకి గాలి అనిల్ కుమార్‌..

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన గాలి అనిల్ సేవలను బీఅర్ఎస్ పార్టీ గౌరవిస్తుందన్నారు

  • Author : Sudheer Date : 16-11-2023 - 11:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gali Anil Kumar
Gali Anil Kumar

ఎన్నికల సమయం (TS Polls) దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ టికెట్ (Congress Ticket) ఆశించి భంగపడ్డ నేతలంతా కారెక్కుతున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ కీలక నేతలు (కాంగ్రెస్ Leaders) బిఆర్ఎస్ లో చేరగా..తాజాగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్ (Gali Anil Kumar) సైతం బిఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. నర్సాపూర్‌ టికెట్‌ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న గాలి అనిల్‌ కుమార్‌ బుధవారం కాంగ్రెస్‌ పార్టీకి (Congress) రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో గురువారం ఉదయం బిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు (Hairsh Rao) …అనిల్‌ కుమార్‌ ను కలిశారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి అమీన్ పూర్‌లోని గాలి అనిల్ కుమార్ ఇంటికి వెళ్లి బీఅర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన గాలి అనిల్ సేవలను బీఅర్ఎస్ పార్టీ గౌరవిస్తుందన్నారు. తిరిగి బీఅర్ఎస్ పార్టీలో చేరితే భవిష్యత్తులో ఆయన సేవలను పార్టీకి వినియోగించుకుని తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హరీష్ రావు ఆహ్వానాన్ని స్వాగతించిన గాలి అనిల్ కుమార్ తన కార్యకర్తలతో నర్సాపూర్ లో జరగనున్న ముఖ్యమంత్రి సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నేతల తీరుతో మనస్థాపం చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నానని అనిల్‌ కుమార్‌ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయి దీనస్థితిలో ఉన్న సమయంలో ఆ పార్టీ జెండాను మోసినట్టు గుర్తు చేశారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశామని, ఖర్చుకు వెనుకాడలేదన్నారు. ఇప్పుడు టికెట్‌ ఇచ్చే సమయంలో పార్టీ రాష్ట్ర నేతలు వ్యవహరించిన తీరు బాగాలేదన్నారు. పార్టీ కోసం 24 గంటలు కష్టపడిన వారిని కాదని టికెట్‌ కావాలని అప్లికేషన్‌ కూడా పెట్టని వారికి టికెట్‌ కేటాయించడం అన్యాయమన్నారు. అప్లికేషన్‌ పెట్టని 40మందికి టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. బీసీలకు న్యాయంగా 34 సీట్లు ఇస్తామని మొండిచెయ్యి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో కష్టపడిన వారికి న్యాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also : Balakrishna : టీడీపీ-జనసేన కలయిక కొత్త శకానికి నాంది – బాలకృష్ణ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • gali anil kumar
  • kcr

Related News

Psr Saval Kcr

Ponguleti Srinivas Reddy : కేసీఆర్‌కు మంత్రి పొంగులేటి బహిరంగ సవాల్

మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సవాల్ విసిరారు

    Latest News

    • అమెరికా యుద్ధనౌకపై దాడి చేశామన్న ఇరాన్.. ఖండించిన అమెరికా!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • ఎంజీఆర్ పై కామెంట్లు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్‌

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!

    Trending News

      • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

      • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd