Hyderabad Floods: డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం
Hyderabad Floods: చాదర్‌ఘాట్, పురానాపూల్, ఎంజీబీఎస్, మూసారాంబాగ్ వంటి లోతట్టు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి
- By Sudheer Published Date - 05:00 PM, Sat - 27 September 25

ఇటీవలి భారీ వర్షాలతో పాటు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నుండి అధిక నీటిని విడుదల చేయడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. దీని ఫలితంగా నగరంలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా చాదర్‌ఘాట్, పురానాపూల్, ఎంజీబీఎస్, మూసారాంబాగ్ వంటి లోతట్టు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి, వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది మంది ప్రజలు ఇళ్లలో చిక్కుకుపోవడంతో అధికారులు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నారు. ఈ పరిస్థితి నగర వాసుల ఆందోళనకు గురిచేస్తోంది.
Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రవర్తనపై అమీ బెరా కీలక వ్యాఖ్యలు.. ఎవరీ బెరా?!
హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ విభాగాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడం, ఆహారం, త్రాగునీరు, వైద్య సేవలను అందించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. నష్టాన్ని అంచనా వేసి, పునరావాసానికి అవసరమైన వనరులను కేటాయించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సమన్వయంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వం నియంత్రణ సాధిస్తోంది.
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. సింగూరు, మంజీరా బ్యారేజీల నుంచి విడుదలైన భారీ నీటితో నది పరీవాహక ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి. ఏడుపాయల వనదుర్గా ఆలయం గత కొన్ని రోజులుగా వరద నీటిలో మునిగిపోవడం విశేషం. వరద ధాటికి ఆలయం వద్ద ప్రసాదాల పంపిణీ షెడ్డు కొట్టుకుపోవడం, ఆలయానికి వచ్చే దారులన్నీ మూసివేయడం వల్ల భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలు మునిగిపోవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. పశువుల కాపరులు, మత్స్యకారులు నది వైపు వెళ్లవద్దని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగవచ్చని అంచనా.
డ్రోన్ విజువల్స్
హైదరాబాద్ నగరంలో ఉదృతంగా ప్రవహిస్తున్న మూసీ నది
హిమాయత్ సాగర్ గేట్లు ఒకేసారి ఎత్తడంతో భారీగా ప్రవహిస్తున్న మూసీ
రక్షణ చర్యలు చేపడుతున్న అధికారులు https://t.co/lGf4Z42hU2 pic.twitter.com/9lSK7Xxwri
— Telugu Scribe (@TeluguScribe) September 27, 2025