Tall Story:ఓ మరుగుజ్జు విజయగాధ
రీల్ లైఫ్స్ అర్ ఇన్స్పైర్డ్ విత్ రియల్ లైఫ్స్ అంటారు. అలాంటి రీల్ లైఫ్ లో రాసిన ఒక సినిమా పాటలోని పదాలు 'మనిషి అనుకుంటే కానిది ఏమున్నది' అని మొదలవుతాయి.
- Author : Siddartha Kallepelly
Date : 05-12-2021 - 7:15 IST
Published By : Hashtagu Telugu Desk
రీల్ లైఫ్స్ అర్ ఇన్స్పైర్డ్ విత్ రియల్ లైఫ్స్ అంటారు. అలాంటి రీల్ లైఫ్ లో రాసిన ఒక సినిమా పాటలోని పదాలు ‘మనిషి అనుకుంటే కానిది ఏమున్నది’ అని మొదలవుతాయి. ఆ పదాలు
హైదరాబాద్కు చెందిన నలభై రెండేళ్ల గట్టిపల్లి శివ్లాల్ అనే వ్యక్తికి సరిగ్గా సరిపోతాయేమో.
శివలాల్ మరుగుజ్జు అతని హైట్ కేవలం మూడు అడుగులు మాత్రమే. అలాంటి వారు తర్వాతి కాలాల్లో అందరికీ ఇన్స్పిరేషన్ గా మారినా వారి మెదటి రోజుల్లో ఎన్నో అవమానాలకు, హేళనలకు గురయ్యే ఉంటారు.
శివలాల్ ఒక ప్రాంతం నుండి ఒకప్రాంతానికి వెళ్ళడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వాడుకునేవారు. అయన బయటకి వెళ్లే క్రమంలో ఎన్నో ఇబ్బందులకు గురై చివరికి తన ట్రావెలింగ్ కోసం తానే ఒక వెహికల్ కొందామనుకున్నాడు. కానీ ఆయన ఫిజికల్ ఫిట్నెస్ దృష్ట్యా ఆయనకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానకి నిరాకరించారు. కనీసం ఆయనకి కార్ నేర్పడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. శివలాల్ మాత్రం వెనక్కి తగ్గకుండా దాన్ని ఒక ఛాలెంజ్ గా స్వీకరించాడు.
https://twitter.com/ANI/status/1467154131936628736
ఎత్తు తక్కువగా ఉన్నా పట్టుదలతో కారు నేర్చుకుని రీసెంట్ గా డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరగుజ్జుగా శివ్లాల్ రికార్డుకెక్కారు.
శివ్లాల్ తన కోసం ఒక కారు డిజైనర్ తో కారులో మార్పులు చేయించుకుని ఆ కార్ తోనే డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ సంపాదించారు.
శివ్లాల్ 2004లో డిగ్రీ పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ పట్టా పొందిన తొలి మరగుజ్జు కూడా శివ్లాల్ కావడం విశేషం.
తాను తక్కువ హైట్ ఉండటం వల్ల చాలా మంది తనను టీజ్ చేసే వారని, వాళ్ళని పట్టించుకోకుండా తనపని తాను చేసుకోవడం వల్ల ఇప్పుడు
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తనపేరు నమోదు చేసుకోవడం ఆనందంగా ఉందని శివలాల్ తెలిపారు.
తనలా ఎత్తు తక్కువగా ఉన్న చాలామంది తమకి డ్రైవింగ్ నేర్పమని అడుగుతున్నారని అలాంటివారికోసం త్వరలోనే డ్రైవింగ్ స్కూల్ పెడతానని శివలాల్ తెలిపారు.
hashtagU తరపున శివలాల్
విజయాలకు అభినందనలు,
ఆయన భవిషత్తు ప్రణాళికలకు ఆల్ ది బెస్ట్.