Kavitha Arrest : కవితను ఢిల్లీకి తరలిస్తున్న ఈడీ అధికారులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు..ఆమెను ఢిల్లీకి తీసుకెళ్తున్నారు
- By Sudheer Published Date - 07:07 PM, Fri - 15 March 24
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు..ఆమెను ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. 8:45 ఫ్లైట్ కు ఆమెకు టికెట్ బుక్ చేసారు. ఈ క్రమంలో ఆమెను తన నివాసం నుండి ఎయిర్ పోర్ట్ కు తీసుకెళ్తున్నారు. గత కొద్దీ నెలలుగా బిఆర్ఎస్ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి , కేసీఆర్ అనారోగ్యానికి గురికావడం..కొద్దీ రోజులుగా వరుసపెట్టి నేతలు పార్టీ ని విడిచి వెళ్తుండడం ఇలా వరుసగా ఎదురుఅవుతుండగా..ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో భారీ కుదుపు ఏర్పడింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే విచారణ ఎదురుకున్న కవిత..నేడు ఢిల్లీ నుంచి సెర్చ్ వారెంట్‌తో వచ్చిన 12 మంది అధికారులు సుమారు 4 గంటలపాటు కవిత ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేసి, పలు డాక్యుమెంట్లను, ఫోన్లను స్వాధీనం చేసుకొని ఆమెకు అరెస్ట్ వారెంట్ ను జారీ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న వార్త తెలిసి కవిత నివాసం వద్దకు భారీగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు , అభిమానులు, మహిళలు ఇంటి వద్దకు చేరుకొని కవిత కు మద్దతు తెలుపుతూ..బిజెపి తీరు ఫై , మోడీ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు కవిత నివాసం వద్దకు భారీగా చేరుకొని.. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha Arrest) ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం ఫై మాజీ మంత్రి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR)..ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కనీసం తమ న్యాయవాదినైనా అనుమతించాలి కదా అని వాదించారు. అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పి ఇప్పుడెలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు. ‘కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శని, ఆదివారాలు కోర్టుకు సెలవు ఉంటుందనే ఉద్దేశంతోనే కావాలని శుక్రవారం వచ్చారు’ అని ఆయన ఆరోపించారు. కేటీఆర్ ప్రశ్నలకు ఈడీ అధికారులు ఎలాంటి సమాదానాలు చెప్పకుండా ..వారిని సముదాయించే ప్రయత్నం చేసారు.
Read Also : Kavitha Arrest : ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం..
Related News
MLC Kavitha : 63 రోజులు అవుతున్నా కవిత బెయిల్‌పై నో క్లారిటీ..!
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ విచారణలో ఇప్పటికే తీహార్ జైలులో ఉన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె కవితను సిబిఐ అరెస్టు చేసింది. ఈడీ ఆమెను గతంలో మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్టు చేసింది.