Double Bedroom Houses : మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు- రేవంత్ ప్రకటన
Double Bed Room : రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్.. మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు రేపు ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించారో తెలియజేయనున్నారు
- By Sudheer Published Date - 10:20 PM, Tue - 24 September 24

మూసీ నిర్వాసితులకు 16వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను (Double Bedroom Houses) కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) నిర్ణయం తీసుకుంది. మూసీ రివర్ బెడ్ (నదీ గర్భం) (Musi River Catchment Area), బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలకు పునరావాసం కల్పించేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వే ప్రకారం 10,200 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్.. మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు రేపు ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించారో తెలియజేయనున్నారు.
ముందుగా రివర్ బెడ్ లో ఆక్రమణలో ఉన్న 1600 ఇళ్లను తొలగించి.. అక్కడున్న వారిని తరలించనున్నారు. RFCTLARR చట్టం ప్రకారం పరిహారం చెల్లించనుంది. పట్టా భూమి ఉంటే ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చుతో పాటు భూమి విలువ కూడా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ బాధిత ప్రజలందరికీ చట్ట ప్రకారం పునరావాసం కల్పిస్తామని సీఎం ఇప్పటికే భరోసా ఇచ్చారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు.
Read Also : Mynampally : బాంబ్ పేల్చిన మైనంపల్లి..