Kidney Theft – Hyderabad : రోగికి తెలియకుండా కిడ్నీ కాజేసిన డాక్టర్లు
Kidney Theft - Hyderabad : మనిషి దగ్గరున్న ఏదైనా వస్తువు దొంగిలించబడే అవకాశం ఉంటుంది.. కానీ అతడి బాడీలోని పార్ట్స్ దొంగతనానికి గురయ్యే ఛాన్స్ ఉండదు.
- By Pasha Published Date - 02:09 PM, Mon - 18 December 23

Kidney Theft – Hyderabad : మనిషి దగ్గరున్న ఏదైనా వస్తువు దొంగిలించబడే అవకాశం ఉంటుంది.. కానీ అతడి బాడీలోని పార్ట్స్ దొంగతనానికి గురయ్యే ఛాన్స్ ఉండదు. కానీ కొందరు డాక్టర్లు ఓ రోగికి తెలియకుండా.. అతడి కిడ్నీని దొంగిలించారు. ఖమ్మ జిల్లా కొత్తగూడెంకు చెందిన రేణుకుంట్ల రవిరాజు అనే మెకానిక్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. అతడు 2011లో కోల్‌కతాలోని తన బంధువుల ఇంటికి వెళ్లగా కడుపు నొప్పి రావడంతో అక్కడే ఉన్న ఆసుపత్రిలో చూపించుకుని హెర్నియాకు ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈ చికిత్సకు ముందు జరిపిన వైద్య పరీక్షల్లో ఎడమవైపు కిడ్నీ కనిపించడం లేదని డాక్టర్లు చెప్పారు. ఆ మాటలను పట్టించుకోని రవిరాజు.. 2012లో కడుపు నొప్పి రావడంతో ఖమ్మం మెడికేర్ డయాగ్నోస్టిక్ సెంటర్, మమత మెడికల్ కాలేజీల్లో టెస్టులు చేయించుకున్నాడు. అక్కడ కూడా ఒక కిడ్నీ లేదన్న విషయాన్ని తెలుసుకుని.. చివరకు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. హెర్నియా ఆపరేషన్ సమయంలో సికింద్రాబాద్‌లోని పౌలోమి ఆసుపత్రి వైద్యులు తనకు తెలియకుండా కిడ్నీని దొంగిలించారని.. దాన్ని రూ.50 లక్షలకు అమ్ముకున్నారని రవిరాజు(Kidney Theft – Hyderabad) కంప్లయింట్ చేశాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. 2009 జులైలో హెర్నియా సమస్యతో రవిరాజు సికింద్రాబాద్‌లోని పౌలోమి ఆస్పత్రిలో చేరగా అక్కడి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి రెండు కిడ్నీలు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రవిరాజుకు ఆపరేషన్ చేసి జులై 31న డిశ్చార్జి చేశారు.ఈ విషయంలో వైద్యుల తీరును వినియోగదారుల కమిషన్ తప్పుబట్టింది. ఇందుకు పరిహారంగా రూ.30 లక్షలతో పాటు ఖర్చుల కింద రూ.25 వేలు ఇవ్వాలని సికింద్రాబాద్ పౌలోమి ఆసుపత్రికి చెందిన డాక్టర్ నందకుమార్ బి.మధేకర్, డాక్టర్ ప్రసాద్ బెహరాలకు ఆదేశించింది.
Also Read: Mallika Sagar : రేపే ఐపీఎల్ మినీ వేలం.. ఆక్షనీర్‌గా ‘మల్లిక’.. ఎవరామె ?
వాస్తవానికి ఈ వ్యవహారంలో తమ తప్పేం లేదని పౌలోమి ఆసుపత్రి డాక్టర్లు తొలుత వినియోగదారుల కమిషన్ ఎదుట వాదన వినిపించారు. అయితే రవిరాజును డిశ్చార్జి చేసే ముందు అల్ట్రాసౌండ్ పరీక్ష చేసినట్లు రుజువులను సమర్పించడంలో డాక్టర్లు విఫలమయ్యారు. దీంతో వారు తప్పు చేసినట్లుగా భావించిన వినియోగదారుల కమిషన్.. ఆపరేషన్ ముసుగులో చట్టవిరుద్ధంగా కిడ్నీ తీసుకున్నారని గుర్తించింది.