HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Disqualification Of Defected Mlas Case Hearing Postponed

Disqualification : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మరోసారి వాయిదా

Disqualification : మంగళవారం జరిగిన విచారణలో బీఆర్ఎస్ తరఫున వాదనలు ముగియగా, స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి తరఫున వాదనలు ఏప్రిల్ 2న వింటామని కోర్టు వెల్లడించింది

  • Author : Sudheer Date : 25-03-2025 - 4:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Disqualification Petition
Disqualification Petition

తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత(Disqualification )పై దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు (Supreme Court) మరోసారి వాయిదా వేసింది. మంగళవారం జరిగిన విచారణలో బీఆర్ఎస్ తరఫున వాదనలు ముగియగా, స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి తరఫున వాదనలు ఏప్రిల్ 2న వింటామని కోర్టు వెల్లడించింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఈ విషయంలో నిర్ణయం ఆలస్యంగా తీసుకున్నారని పిటిషనర్లు కోర్టుకు వాదనలు వినిపించారు. అయితే స్పీకర్ తన విధి నిర్వహణలో ఉన్నారని, నిర్ణయానికి ఏమైనా కారణాలు ఉండొచ్చని అసెంబ్లీ కార్యదర్శి పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలా? లేక రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా? అనే అంశంపైనా న్యాయస్థానం చర్చించింది.

New Ministers : మంత్రివర్గ విస్తరణ.. ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణం ?

ఎమ్మెల్యేల అనర్హతపై వాదనలు మంగళవారం ముగిసినప్పటికీ, ఈ వ్యవహారంపై ఇంకా స్పష్టమైన తీర్పు రాలేదు. తెలంగాణ హైకోర్టు గతంలో స్పీకర్‌కు నాలుగు వారాల గడువు ఇచ్చినప్పటికీ, అనర్హత పిటిషన్లపై ఇప్పటికీ స్పీకర్ నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు. బీఆర్ఎస్ తరఫున వాదించిన న్యాయవాది స్పీకర్ నోటీసులు ఇచ్చి మూడు వారాలు దాటినా, ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. మరోవైపు, సుప్రీంకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇంకా పదవిలో కొనసాగుతుండటంపై ప్రశ్నలు గుప్పించింది. “పార్టీ ఫిరాయింపుల కేసు ఏడాదిగా కొనసాగుతోంది, స్పీకర్ నిర్ణయం ఎందుకు ఆలస్యం చేస్తున్నారు?” అంటూ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.

Bollywood To Tollywood : టాలీవుడ్‌‌‌కు వచ్చేస్తా.. ఎందుకో చెప్పిన సన్నీ దేవల్

ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ వేశారు. బీజేపీ తరఫున కూడా ఎలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై వాదనలు పూర్తయిన తర్వాతే తమ పిటిషన్ విచారించాలని బీజేపీ కోర్టును కోరింది. అయితే సుప్రీంకోర్టు ప్రస్తుత విచారణలో స్పీకర్ నిర్ణయంపై మాత్రమే దృష్టి సారిస్తోందని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి పోటీ చేశారు, ఎటు వెళ్లారనే విషయాలు ఈ విచారణలో భాగం కాదని కోర్టు పేర్కొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Disqualification Casem BRS MLAS
  • Supreme Court

Related News

Telangana Cm Revanth Reddy

CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

2016 నాటి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. గతంలో ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు, రేవంత్ రెడ్డిపై ఉన్న ఆరోపణలను కొట్టివేస్తూ (Quash) తీర్పునిచ్చింది.

  • Ias Srilakshmi

    ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

  • Prathyusha Death Case

    Actress Pratyusha Case : నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడికి సుప్రీం కోర్టు బిగ్ షాక్

Latest News

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd