HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Disha Encounter Kin Of Victims Seek Punishment For Policemen

Disha Encounter: బూటకపు ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులను శిక్షించాల్సిందే: బాధితుల బంధువులు.!!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని సుప్రీంకోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది.

  • Author : Hashtag U Date : 21-05-2022 - 12:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
disha encounter
disha encounter

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని సుప్రీంకోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. సుదీర్ఘంగా విచారించిన సిర్ప్కూర్కర్ కమిషన్…ఫేక్ ఎన్ కౌంటర్ ని…ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చేందుకే పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపారని నిర్ధారించింది. ఈ మేరకు ఎన్ కౌంట్ ఘటనలో పాల్గొన్న పది మంది పోలీసు అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది.

ఈ విషయంపై నిందితుల తల్లిదండ్రులు స్పందించారు. ఎన్ కౌంటర్ కు పాల్పడిన పోలీసులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టుకు బదిలీ చేసినప్పుడే తమకు న్యాయం జరుగుతుందని ఆశించామని నిందితుల కుటుంబీకులు అంటున్నారు. తమ పిల్లలు నేరం చేస్తే…వారిని న్యాయం శిక్షిస్తుంది కానీ..తక్షణ న్యాయం పేరుతో పోలీసులే ఎన్ కౌంటర్ చేసి చంపారన్నారు. సిర్ప్కూర్కర్ కమిషన్ ముందు తాము ఈ విషయాలనే చెప్పామని …తమకు కమిషన్ న్యాయం చేసినందుకు తాము సంతృప్తి చెందామన్నారు.

నిందితుల్లో ఒకరైన జొల్లు శివ తండ్రి కూమారయ్య మాట్లాడుతూ…నా కొడుకుతోపాటు మరో ముగ్గురిని పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ చేశారని కమిషన్ చెప్పాము. వాళ్లు ఏదైనా తప్పు చేసి ఉంటే కోర్టు శిక్షిస్తుండేది కానీ పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ లో హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టు తమకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దోషులైన పోలీసులను కఠినంగా శిక్షించాలని మహమ్మద్ ఆరీఫ్ తండ్ర మహ్మద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. హైకోర్టుకూడా తమ న్యాయం చేస్తుందన్న నమ్మకం మాకుందన్నారు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ నిజమేనని ఏ ఒక్కరూ అనుకోవడం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేయించారని గొప్పలు చెప్పుకున్నారు. అప్పటి కమిషన్ సజ్జనార్ ను అందరూ భుజాన ఎత్తుకున్నారు. అప్పట్లో భావోద్వేగాలు అలా ఉన్నాయి. అయితే దిశ అనే యువతిని దారుణంగా హత్య చేశారు. కానీ నిందితులు వాళ్లేనా కాదా అన్నది తేలకుముందే తెల్లవారుజామున ఎన్ కౌంటర్ చేశారు. అది ఇప్పుడు ఫేక్ ఎన్ కౌంటర్ అని సాక్ష్యాలతో సహా తేలింది. ఇప్పుడు పోలీసులకు ఎలాంటి చిక్కులు వస్తాయి. ఫేక్ ఎన్ కౌంటర్ ఫలితం కూడా పోలీసులు అనుభవిస్తారా లేదా అన్నది వేచిచూడాల్సిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • disha encouter
  • Supreme Court
  • telangana police. relatives of victims

Related News

Supreme Court Gives Green Signal for Caste Census

Supreme Court: జనగణనలో కులగణనపై సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

దేశంలో కులగణన (Caste Census) ప్రక్రియపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. జనగణనలో భాగంగా కులాల లెక్కింపును చేపట్టడానికి న్యాయస్థానం లైన్ క్లియర్ చేసింది. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, వాటిని పూర్తిగా కొట్టివేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా

  • Supreme Court Delivers Landmark Verdict on Stray Dogs

    Supreme Court: వీధి కుక్కల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Latest News

  • Skoda : స్కోడా ఆటో ఇండియా ప్రచారం

  • kingFisher Beer : బీర్ బాటిల్‌లో అపరిశుభ్ర వస్తువు? క్లారిటీ ఇచ్చిన కింగ్‌ఫిషర్ యాజమాన్యం!

  • CBN In Kuppam: రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తిన్న సీఎం చంద్రబాబు దంపతుల

  • Jr NTR లూగర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..!

  • Sunil Narang: తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా

Trending News

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd