Group 1 Exam : గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై మంత్రి పొన్నం నివాసంలో చర్చలు
Group 1 : గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లు, జీవో 29 రద్దుపై రేపు ఉదయం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- By Sudheer Published Date - 10:49 PM, Sat - 19 October 24

గ్రూప్ 1 పరీక్షలు, జిఓ 29 అంశం, గ్రూప్ 1 అభ్యర్హులు చేస్తున్న విజ్ఞప్తులు, అభ్యంతరాలు, సాధ్యాసాధ్యాలపై మంత్రి పొన్నం నివాసంలో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర్ రాజా నర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లు, జీవో 29 రద్దుపై రేపు ఉదయం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై గ్రూప్-1 అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
గత కొద్దీ రోజులుగా గ్రూప్-1 పరీక్ష (Group 1 Exam) రీ షెడ్యూల్ చేయాలని కోరుతూ అభ్యర్థులు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. గత కొద్దీ రోజులుగా వారంతా ఆందోళనలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఈరోజు ఏకంగా చలో సచివాలయం పిలుపునిచ్చారు. అభ్యర్థుల వెంట బిజెపి , బిఆర్ఎస్ కూడా జతకట్టింది. ఈ క్రమంలో పోలీసులు బిజెపి నేతలతో పాటు బిఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఇలా ప్రతిపక్షాల డిమాండ్స్ , అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో సీఎం రేవంత్ GO 29 తో పాటు గ్రూప్ 1 ఎగ్జామ్స్ పై స్పందించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి యథాతథంగా జరుగుతాయని CM రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘పరీక్షలకు సిద్ధం కండి. 95శాతం మంది అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మరో 5శాతం మంది డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిపక్షాల మాయమాటలను నమ్మకండి. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. మేం వచ్చాకే వేల ఉద్యోగాలు కల్పిస్తున్నాం’ అని పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమంలో సీఎం చెప్పుకొచ్చారు. మరి రేపు దీనిపై ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.
Read Also : OG Cover Page : పూనకాలు తెప్పిస్తున్న ‘OG’ కవర్ పిక్ ..