Dirty Politics : ఛీ ..ఛీ ..రాజకీయాల కోసం ఇంత దిగజారుతారా..?
Dirty Politics : రాజకీయ విమర్శలు చేసుకోవాలి కానీ ఇతరుల వ్యక్తిగత జీవితాలు తెరపైకి తీసుకురావడం, దానికి తోడు మహిళల జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదని హితవు పలుకుతున్నారు
- By Sudheer Published Date - 06:15 PM, Wed - 2 October 24

తెలంగాణ (Telangana) లో రాజకీయాలు (Politics) రోజు రోజుకు నీచాతి నీచంగా మారుతున్నాయి. ఒకప్పుడు పార్టీల పరంగానే ఆరోపణలు , విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకునేవారు..కానీ ఈరోజు ఇంట్లో ఉన్న ఆడవారిని రోడ్డు పై లాగుతు ..రాజకీయాలకు సంబంధం లేని కుటుంబాలను లాగుతూ పరువు తీసుకుంటున్నారు. తమ గొప్ప నిరూపించుకోవాలనో…లేక ప్రజల్లో నిలువలనో..మీడియా లో హైలైట్ కావాలనో..మరి ఏ ఉద్దేశ్యంతో వ్యాఖ్యలు చేస్తున్నారో కానీ ప్రజలు మాత్రం ఛీ కొడుతున్నారు. గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో బిఆర్ఎస్ vs కాంగ్రెస్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మంత్రి కొండా సురేఖ పై దారుణంగా ట్రోల్స్ వస్తుండడం తో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇదంతా కేటీఆర్ కనుసన్నల్లో జరుగుతుందని ఆరోపించింది.
ఇక ఈరోజు ఏకంగా చిత్రసీమ (Film Industry ) లోని పలువురు వ్యక్తులను లాగుతూ కొండా సురేఖ (Konda Surekha) సంచలన ఆరోపణలు చేసింది. నాగ చైతన్య – సమంత (Naga Chaitanya – Samantha Divorce) విడిపోవడానికి కారణం కేటీఆర్ (KTR) అని , N కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే సమంత ను తన దగ్గరికి పంపాలని కేటీఆర్ డిమాండ్ చేయడం తో.. నాగార్జున..సమంత ను కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని ఫోర్స్ చేసాడు..కానీ సమంత ఒప్పుకోలేదు…అలాంటి పని చేయనంటే..చేయనని తేల్చి చెప్పడం తో..కుటుంబంలో గొడవలు జరిగాయి. కేటీఆర్ దగ్గరికి వెళ్లకపోతే మా ఇంట్లో ఉండొద్దని నాగార్జున తెచ్చి చెప్పడంతో..ఆ పని చేయలేక సమంత విడాకులు తీసుకుంది. నాగ చైతన్య – సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే అని తేల్చి చెప్పింది. రకుల్ ప్రీతీ సింగ్ త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా కేటీఆరే అని పలువురు హీరోయిన్స్ కు మత్తుమందు అలవాటు చేసింది కేటీఆరే అని సురేఖ తెలిపింది.
మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు చిత్రసీమ తో పాటు ఇటు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. బతుకమ్మ పండుగ ప్రారంభం రోజే ఒక ఆడపిల్ల జీవితంతో రాజకీయంగా తీవ్ర ఆరోపణలు చేయడం విమర్శలు వస్తున్నాయి. ఇతర పార్టీల నాయకులపై రాజకీయంగా విమర్శించే శక్తి లేక సినీ పరిశ్రమకు చెందిన వారిని రాజకీయాల్లోకి లాగడం వివాదాస్పదంగా మారింది. కొండా సురేఖ చెప్పిందట్లో ఎంత నిజం ఉంది..? ఎలాంటి ఆధారాలు ఉన్నాయి..? ఓ కన్వెన్షన్ కోసం నాగార్జున ఇంత దిగజారుతారా..? కొడుకు భార్య ను మరో వ్యక్తి దగ్గరికి పంపిస్తాడా..? ఇదేమైనా సినిమానా..? ఇలాంటి వ్యాఖ్యలు కొండా సురేఖ ఎలా చేసింది..? ఓ హోదా లో ఉన్న ఆమె..మరో మహిళా ఫై ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఏంటి..? హీరోయిన్లు అంటే కేవలం అలాంటి పనులకేనా..? అని అభిమానులు , నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా కొండా సురేఖ ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. రాజకీయ విమర్శలు చేసుకోవాలి కానీ ఇతరుల వ్యక్తిగత జీవితాలు తెరపైకి తీసుకురావడం, దానికి తోడు మహిళల జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదని హితవు పలుకుతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా లో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇప్పటికే హైడ్రా (Hydraa) పేరుతో కాంగ్రెస్ ప్రజల్లో నమ్మకం పోగొట్టుకుంది. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరింత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇక మంత్రి వ్యాఖ్యలపై నాగార్జున సైతం సీరియస్ అయ్యారు. మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలపై నాగార్జున (Nagarjuna ) స్పందించారు. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను.
గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 2, 2024
Read Also : Vettaiyan : ‘వేట్టయన్’ ట్రైలర్ వచ్చేసింది.. అమితాబ్ వర్సెస్ రజినీకాంత్..