Differences in BJP : తెలంగాణ బీజేపీలో విభేదాల హోరు!ట్విట్టర్ వార్ షురూ!!
బీజేపీలోని అసహనం(Differences in BJP) ట్వీట్ల రూపంలో బయటకు వస్తోంది. తెలంగాణ బీజేపీ లీడర్లలోని అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది.
- By CS Rao Published Date - 01:30 PM, Fri - 30 June 23
బీజేపీలోని అసహనం(Differences in BJP) ట్వీట్ల రూపంలో బయటకు వస్తోంది. తెలంగాణ బీజేపీ లీడర్లలోని అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. మాజీ ఎంపీ, బీజేపీ లీడర్ జితేంద్రరెడ్డి గరువారం చేసిన ట్వీట్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్రకు తగిలింది. పెద్దరికం వచ్చే కొద్దీ ఆచితూచి మాట్లాడాలని చురకలు వేశారు. ఎవరి స్వేచ్ఛ, గౌరవం వాళ్లకు ఉంటుందని, దాన్ని ఎదుటి వాళ్లు గౌరవించాలంటూ పరోక్షంగా జితేంద్రరెడ్డి మీద ఈటెల మండిపడ్డారు. ఇదే సమయంలో విజయశాంతి ట్విట్టర్ వేదిక మీద రాజాసింగ్ బహిష్కరణ అంశాన్ని తీసుకురాడం గమనార్హం.
బీజేపీలోని అసహనం ట్వీట్ల రూపంలో.(Differences in BJP)
దున్నుపోతుకు తోకను మెలివేసి తన్ని వాహనంలో ఎక్కించిన ఒక వీడియోను గురువారం ట్వీట్ చేస్తూ తెలంగాణ బీజేపీకి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ కావాలని కొటేషన్ పట్టారు. దాన్ని బీజేపీ అగ్రనేతలకు కూడా పిన్ చేయడం విశేషం. దాన్ని చూసిన ఈటెల మాత్రం ఈ వీడియోలని ఆంతర్యం ఏమిటి? అనేది జితేంద్ర చెప్పాలంటూ మీడియా ముందు ముక్తాయించారు. అదే సమయంలో చురకలు వేస్తూ జితేంద్రరెడ్డి మీద పరోక్షంగా ఫైర్ కావడం ఆ పార్టీలోని అసంతృప్తులను Differences in BJP) గ్రూప్ విభేదాలను తెలియచేస్తోంది.
విజయశాంతి చాలా కాలంగా బీజేపీలో అసంతృప్తిగా..
ఇక విజయశాంతి చాలా కాలంగా బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారని సోషల్ మీడియాలో న్యూస్ వస్తోంది. కానీ, ఆమె ఎక్కడా తొడ్రుపాటు లేకుండా ఆ పార్టీలో కొనసాగుతున్నారు. కొన్ని వేదికలపై విజయశాంతి సీనియార్టీకి, గ్లామర్ కు తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ఆ విషయాన్ని ఆమె అభియానులు తరచూ గుర్తు చేసుకుంటున్నారు. అయినప్పటికీ ఏకపక్షంగా బండి సంజయ్ వెళుతున్నారు. ఆయన మీద వ్యతిరేకంగా ఒక బలమైన గ్రూప్ పనిచేస్తోంది.నిజమైన లీడర్లు, కార్యకర్తలను గుర్తించడంలేదన్న అపవాదు ఆయనపై వేశారు. అందుకు ఉదాహరణగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బహిష్కరణ అంశాన్ని చెబుతుంటారు. ఇప్పుడు అదే అంశంపై విజయశాంతి(Differences in BJP) గళం విప్పారు.
Also Read : Differences in BJP : బీజేపీలో కుమ్ములాట! జితేంద్రరెడ్డి ట్వీట్ దుమారం!!
వాస్తవంగా రాజాసింగ్ ను బహిష్కరించినప్పటికీ బీజేపీలోనే కొనసాగుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోలేదు. ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో రాజసింగ్ మీద బహిష్కరణ ఎత్తివేయాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. వాళ్ల వాయిస్ ను ట్వీట్టర్ వేదికగా విజయశాంతి వినిపిస్తున్నారు. పలు ట్వీట్లను ఆమె చేస్తూ రాజాసింగ్ కు మద్ధతు పలికారు. కార్యకర్తల మనోభావాలు, రాజాసింగ్ అభిమానుల డిమాండ్ ను బీజేపీ అధిష్టానం పరిశీస్తుందని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు. అంతేకాదు, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో సహా బీజేపీ లీడర్లందరూ రాజాసింగ్ అభిమానులు, కార్యకర్తల డిమాండ్ ను పరిశీలిస్తారని భావిస్తున్నట్టు మరో ట్వీట్ చేశారు. మొత్తం మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి బీజేపీ బహిష్కరణకు గురైన రాజాసింగ్ పక్షాన విజయశాంతి నిలవడం (Differences in BJP) పక్కచూపులు చూడ్డంలో భాగమా? అనే సందేహం కలుగుతుంది.
Also Read : Rajasingh: ఉగ్రవాద సంస్థ నాపై కుట్రకు పాల్పడుతోంది: రాజాసింగ్.
Related News
Vijayashanthi : బీజేపీకి విజయశాంతి గుడ్ బై దేనికి సంకేతం?
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్న కొన్ని గంటల్లోనే ఆ పార్టీ నుంచి మరో సీనియర్ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) నిష్క్రమించినట్టు వార్తలు వచ్చాయి.