CPGET Results : “సీపీ గెట్” ప్రవేశ పరీక్ష రిజల్ట్స్ ఈరోజే
CPGET Results : తెలంగాణలోని కాలేజీల్లో పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన "పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీ గెట్) -2023" ఫలితాలను ఇవాళ (శుక్రవారం) వెల్లడించనున్నారు.
- By Pasha Published Date - 08:23 AM, Fri - 18 August 23

CPGET Results : తెలంగాణలోని కాలేజీల్లో పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన “పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీ గెట్) -2023” ఫలితాలను ఇవాళ (శుక్రవారం) వెల్లడించనున్నారు. సీపీ గెట్ ద్వారా ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, జేఎన్టీయూహెచ్, మహిళా వర్సిటీల్లో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎమ్మెస్సీ వంటి సంప్రదాయ కోర్సుల్లో సీట్లను భర్తీచేస్తారు.
Also read : Today Horoscope : ఆగస్టు 18 శుక్రవారం రాశి ఫలితాలు.. వారు సంయమనంతో మెలగాలి
దీనికి సంబంధించిన ఆన్‌లైన్ పరీక్షలు జూన్ 30 నుంచి జులై 10 వరకు జరిగాయి. ఈ ఏడాది మొత్తం 69,439 మంది అభ్యర్థులు సీపీ గెట్ పరీక్షలు రాశారు. ఈ యూనివర్సిటీల్లోని 84 సబ్జెక్టులకు రాష్ట్రంలోని 12 జోన్లలో పరీక్షలు నిర్వహించారు. వీటి ద్వారా 320 కాలేజీల్లో ఉన్న 50 కోర్సుల 112 విభాగాలలోకి విద్యార్థులు ప్రవేశాలు(CPGET Results) కల్పిస్తారు.
Also read : Shravana Masam 2023: శ్రావణ శుక్రవారం ప్రత్యేకతలేంటి..? వ్రతం ఎందుకు చేయిస్తారు..?