Mamata In TS: తెలంగాణలో మమత రాజకీయాలు నడవవు!
- By Hashtag U Published Date - 11:03 PM, Thu - 9 December 21

బెంగాల్ సీఎం మమత తన పార్టీ తృణమూల్ కాంగ్రేస్ ను విస్తరించాలని భావిస్తోన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రియాక్టయ్యారు. నా తెలంగాణలో మమత కలలు. నెరవేరవని, తన పప్పులు ఇక్కడ ఉడకవని శశిధర్ రెడ్డి స్పష్టం చేసారు.
బెంగాల్ ఎన్నికలలో బీజేపీ వ్యూహాలను తిప్పికొట్టడంలో మమత బెనర్జీ సంపూర్ణ విజయం సాధించినప్పటికీ, తెలంగాణాలో టీఎంసీ ఎటువంటి ప్రభావం చూపదని. శశిధర్ రెడ్డి అబిప్రాయపడ్డారు.

Marri Shashidhar Reddy
ఎలక్షన్ వ్యూహాలలో మంచి పేరు సంపాదించిన ప్రశాంత్ కిషోర్ పాత్ర పై కూడా అందరికి అనుమానాలున్నాయని శశిధర్ రెడ్డి తెలిపారు. పీకే మోడీ-షా ద్వయానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, వారిచ్చిన కాంగ్రెస్ ముక్త్ భారత్ పిలుపును ప్రశాంత్ కిషోర్ చిలుకలాగా పలుకుతున్నారని ఆయన ఆరోపించారు. పీకే గైడెన్స్ లో తెలంగాణాలో బలపడుతానని మమత అనుకుంటే అది వృధా ప్రయాస అవుతుందని ఆయన తెలిపారు.
దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని ఈ సమయంలో థర్డ్ ఫ్రంట్ కడితే ప్రభావముంటుందని పలు ప్రాంతీయ పార్టీలు ఆశపడుతున్నప్పటికీ కాంగ్రెస్ రహిత థర్డ్ ఫ్రంట్ సాధ్యం కాదని శశిధర్ అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారంతా రాహుల్ వైపు చూస్తున్నారని రానున్న ఎన్నికల్లో రాహుల్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని ఆయన తెలిపారు.