Congress Govt Good News : మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు
Congress Govt Good News : మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ చీరల డిజైన్లు రూపొందించారు. లైట్ బ్లూ కలర్ చీరలకు జాతీయ జెండా మూడు రంగులను అంచుల్లో కలిపి అందంగా డిజైన్ చేశారు
- Author : Sudheer
Date : 17-12-2024 - 9:05 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో మహిళల కోసం నూతన ఏడాది కానుకగా (New Year Gift) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో సర్కార్ ఉచిత యూనిఫాం చీరలను అందించనుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల స్వయం సహాయక మహిళా సంఘ సభ్యులకు ఉచితంగా చీరలు(Sarees for free) అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ చీరల డిజైన్లు రూపొందించారు. లైట్ బ్లూ కలర్ చీరలకు జాతీయ జెండా మూడు రంగులను అంచుల్లో కలిపి అందంగా డిజైన్ చేశారు. ఈ చీరలను స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు అంగన్వాడీ టీచర్లు, ఆయలకు కూడా అందించనున్నారు. మంత్రి సీతక్క తాజాగా ఈ డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించి ఆయన అనుమతి పొందారు. తెలంగాణ హ్యాండ్‌లూమ్ కోఆపరేటివ్ సొసైటీ (TGSCO) ద్వారా ఈ చీరలను ఉత్పత్తి చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రతి సంవత్సరం రెండు చీరలను ఉచితంగా అందజేయాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశం ఉన్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంపై మంత్రి సీతక్క ట్వీట్ చేస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రానికి కొత్తగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు ఉచిత చీరల పంపిణీ ద్వారా వారికి ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా హ్యాండ్‌లూమ్ రంగానికి కూడా ప్రోత్సాహం లభిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
Read Also : Virat Kohli’s Bat: ఫాలోఆన్‌ను తప్పించుకున్న భారత్.. కోహ్లీ సాయం కూడా ఉందండోయ్!