Harish Rao : నువ్వు ఎక్కడ దాక్కున్నావ్..హరీష్ రావు అంటూ సీఎం రేవంత్ ఆగ్రహం
CM Revanth Comments on Harish Rao : హరీశ్ రావు.. మేం రుణమాఫీ చేశాం.. రాజీనామా చేయకుండా నువ్వు ఎక్కడ దాక్కున్నావ్?
- Author : Sudheer
Date : 15-09-2024 - 6:09 IST
Published By : Hashtagu Telugu Desk
CM Revanth Comments on Harish Rao : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud Takes Charge As TPCC Chief) ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యకమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మీము రుణమాఫీ చేసాం.. కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు రాజీనామా చేయకుండా డ్రామాలాడుతున్నారన్నారు. హరీశ్ రావు.. మేం రుణమాఫీ చేశాం.. రాజీనామా చేయకుండా నువ్వు ఎక్కడ దాక్కున్నావ్? అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఎన్నో ఇబ్బందుల మధ్య సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేశామని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తుందన్నారు. మహాలక్ష్మీ పథకంలో ఇప్పటి వరకు మహిళలు 85 కోట్ల ప్రయాణాలు చేశారని వెల్లడించారు. కేటీఆర్, హరీశ్ రావు ఉద్యోగాలు ఊడిన తరువాతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి. 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామకాలు చేశాం. వచ్చే పంటలో సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇస్తాం’ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
గత ప్రభుత్వ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చాం. కాంగ్రెస్ విజయంలో కార్యకర్తలదే కీలక పాత్ర. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. పేదలకు ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే రుణమాఫీని చేశాం. రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాం.. చేసి చూపించాం. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన రెండో రోజు నుంచే హామీలు అమలు చేస్తున్నాం. కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని నిరూపించాం అన్నారు.
ఇదే సందర్బంగా..అరికెపూడి గాంధీ – కౌశిక్ రెడ్డి ఇష్యూపై స్పందించారు. ‘కొందరు కావాలనే గొడవలు సృష్టించాలని చూస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోం. రా చూసుకుందామని కౌశిక్ రెడ్డి ఎందుకు సవాల్ విసిరాడు? వీళ్లు వెళ్లి వీపు పగలగొడితే.. మళ్లీ కొట్టారంటూ వాళ్లు లొల్లి లొల్లి చేస్తారు. మా వాళ్లు ఎవరి జోలికి పోరు..వస్తే ఊరుకోరు. మహేశ్ గౌడ్ సౌమ్యుడు.. ఏం కాదు అనుకోకండి. మహేశ్ గౌడ్ వెనుక నేనుంటా. కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటా’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Read Also : CM Revanth Reddy : కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఉపేక్షించేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి