CM Breakfast Scheme : తెలంగాణ సర్కార్ బడుల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం
విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు, వారి దృష్టి చదువుపై మరింత ఎక్కువగా ఉండేలా అల్పాహారం అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం
- By Sudheer Published Date - 11:24 AM, Fri - 6 October 23

తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన దగ్గరి నుండి కూడా సీఎం కేసీఆర్ (CM KCR) ఎన్నో పథకాలకు శ్రీకారం చుడుతూ ప్రజల్లో ఆనందం నింపుతూ వస్తున్నారు. తాజాగా ఈరోజు మరో గొప్ప పధకానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలోని 27,147 బడుల్లో అల్పాహార పధకాన్ని (CM Breakfast Scheme) మొదలుపెట్టారు. విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు, వారి దృష్టి చదువుపై మరింత ఎక్కువగా ఉండేలా అల్పాహారం అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేరుతో అమల్లోకి తీసుకొచ్చిన ఈ పథకం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది.
We’re now on WhatsApp. Click to Join.
సీఎం బ్రేక్‌ఫాస్ట్ పేరుతో ఈ పథకాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఆర్థికమంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జిల్లాపరిషత్ పాఠశాలలో పథకాన్ని స్టార్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కూడా వివిధ శాఖల మంత్రులు ఈ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొని , విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. సీఎం బ్రేక్‌ఫాస్ట్ వల్ల రాష్ట్రంలోని 27,147 పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతి చదువుతున్న 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. ప్రతిరోజు స్కూళ్ల ప్రారంభానికి అరగంట ముందు విద్యార్థులకు అల్పాహారాన్ని వడ్డించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని పాఠశాలల్లో అక్షయపాత్ర సంస్థ ద్వారా, మిగిలిన జిల్లాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల ద్వారా అల్పాహారాన్ని అందజేస్తారు.
అల్పాహార మెనూ (CM Breakfast Scheme Menu)
సోమవారం: ఇడ్లీ సాంబార్/ గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగళవారం: పూరి, ఆలు కుర్మా/ టమాటా బాత్, చట్నీ
బుధవారం: ఉప్మా,సాంబార్/ కిచిడీ, చట్నీ
గురువారం: మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ / పొంగల్, సాంబార్
శుక్రవారం: ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చట్నీ/ కిచిడీ, చట్నీ
శనివారం: పొంగల్, సాంబార్/వెజ్ పలావ్, రైతా/ఆలు కుర్మా
Read Also : Dasoju Sravan: ఫేక్ ప్రీ పోల్ సర్వే తో రేవంత్ మైండ్ గేమ్ : దాసోజు శ్రవణ్