Chandrababu : రామోజీరావు పార్థివదేహానికి చంద్రబాబు నివాళులు
రామోజీరావు పార్థివదేహానికి నివాళ్లు అర్పించి , కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం నింపారు
- By Sudheer Published Date - 03:01 PM, Sat - 8 June 24

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దంపతులు రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీరావు (Ramojirao).. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసి సినీ , రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
రామోజీరావు మరణ వార్త తెలియగానే టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొద్దీ సేపటిక్రితం ఢిల్లీ నుండి నేరుగా ఫిలిం సిటీ కి వచ్చి రామోజీరావు పార్థివదేహానికి నివాళ్లు అర్పించి , కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం నింపారు. రామోజీరావు తెలుగు వెలుగు, ఆయన మృతి తీరని లోటన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారన్నారు. రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించానని ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు, సలహాలు తాను తీసుకునేవాడినని గుర్తుచేసుకున్నారు. రామోజీ అస్తమయంపై కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్థించారు.
ప్రస్తుతం రామోజీరావు పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. రేపు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు. ఇక కడసారి రామోజీరావు ను చూసేందుకు అన్ని మీడియా చానెల్స్ అధినేతలతో పాటు సినీ , రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివస్తు నివాళ్లు అర్పిస్తున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ వస్తున్నారు.
Read Also : Ramoji Rao : రామోజీ రావు ను హింసించి హత్య చేసారు – వీహెచ్ సంచలన వ్యాఖ్యలు