HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Will Merge With Bjp Cm Ramesh

BRS Will Merge with BJP : బిజెపి లో బిఆర్ఎస్ విలీనం కేటీఆర్ భారీ డీల్ ! – సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు

BRS Will Merge with BJP : విలీనంపై చర్చించేందుకు కేటీఆర్ (KTR) తన ఇంటికి వచ్చారని ఆయన ఆరోపించారు. ఢిల్లీలోని తన నివాసానికి కేటీఆర్ కవితతో కలిసి వచ్చి, తమపై ఉన్న కేసుల్ని ఆపితే బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామని కోరినట్లు వెల్లడించారు

  • Author : Sudheer Date : 26-07-2025 - 5:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brs Merge Bjp
Brs Merge Bjp

తెలంగాణ రాజకీయ వర్గాల్లో బిఆర్ఎస్-బీజేపీ విలీన (BRS Will Merge with BJP) వార్తలు కలకలం రేపుతున్నాయి. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ (CM Ramesh)చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. విలీనంపై చర్చించేందుకు కేటీఆర్ (KTR) తన ఇంటికి వచ్చారని ఆయన ఆరోపించారు. ఢిల్లీలోని తన నివాసానికి కేటీఆర్ కవితతో కలిసి వచ్చి, తమపై ఉన్న కేసుల్ని ఆపితే బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామని కోరినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని సీసీ టీవీ ఫుటేజీతో నిరూపించేందుకు సిద్ధమని అన్నారు.

Sinjara : హరియాలి తీజ్‌కు ముందు రోజు “సింజారా” పండుగ..ఉత్తరాదిన పాటించే ప్రత్యేక ఆచారాలేంటో తెలుసుకుందాం!

కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలపై కూడా సీఎం రమేష్ స్పందించారు. ఫ్యూచర్ సిటీలో తనకు రోడ్ కాంట్రాక్ట్ వచ్చిందన్న ఆరోపణను ఖండించారు. తన కుటుంబానికి చెందిన రుత్విక్ కంపెనీ నిబంధనల ప్రకారం టెండర్ గెలుచుకుందన్నారు. రుత్విక్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్‌ను రేవంత్ రెడ్డి ఇచ్చిన బహుమతిగా కేటీఆర్ అభివర్ణించినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఆంధ్రా కాంట్రాక్టర్లు దోచేస్తున్నారని విమర్శించడం సరికాదన్నారు. ఒకే కంపెనీ టెండర్ గెలవడమే కాకుండా, దాన్ని రాజకీయం చేయడం తగదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎవరికెవరికీ ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారో లెక్కలు వేయాలని సవాల్ విసిరారు.

రాజకీయ అవసరాల కోసం తనపై బురదచల్లడం తగదని, కేటీఆర్ చేసిన ప్రతి పని బయటపెడతానని హెచ్చరించారు. అమెరికా, మాల్దీవులకు కేటీఆర్ ప్రయాణాల వివరాలు తన దగ్గర ఉన్నాయని.. అవన్నీ ఈడీ, సీబీఐకు ఇవ్వనున్నట్లు తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఏం చేశారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్ అధికారం వచ్చిన తర్వాత తమను మర్చిపోయారని, కానీ తాము రాజకీయాలను స్నేహంతో కలపబోమని అన్నారు. ఇక గచ్చిబౌలి భూముల తాకట్టు వ్యవహారంలో బీజేపీ ఎంపీ పాత్ర ఉందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. మరి రమేష్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS Merge BJP
  • BRS Will Merge with BJP
  • cm ramesh
  • CM Ramesh Sensational Comments
  • ktr

Related News

Ktr Velugumatla Demolition

Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.

  • Ktr

    పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd