Telangana Assembly : బీజేపీ ఎమ్మెల్యేకు బీఆర్‌ఎస్ మద్దతు..
Telangana Assembly : బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) మద్దతుగా నిలవడం. మంత్రులు పదేపదే మధ్యలో స్పందించడం సరికాదని
- Author : Sudheer
Date : 04-02-2025 - 5:51 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో కులగణన (Census), ఎస్సీ వర్గీకరణపై జరిగిన చర్చ ఆసక్తికర మలుపు తీసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (BJP MLA Payal Shankar) మాట్లాడుతూ.. బీసీల జనాభా తగ్గిందని, కులగణనలో పలు పొరపాట్లు చోటుచేసుకున్నాయని విమర్శించారు. 2014 సమగ్ర కుటుంబ సర్వేతో తాజా లెక్కలను పోల్చితే, బీసీ జనాభా తగ్గిందని అన్నారు. సర్వే పూర్తిస్థాయిలో జరగలేదని, ప్రజలు పూర్తిగా పాల్గొనలేదని వ్యాఖ్యానించారు.
Cast Census : తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శం – వైస్ షర్మిల
పాయల్ శంకర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు తీవ్రంగా స్పందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా సర్వే నిర్వహించిందని స్పష్టం చేశారు. ప్రజల్లో అపోహలు కలిగించేలా అసెంబ్లీలో మాట్లాడవద్దని సూచించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే చట్టసవరణ చేయాల్సి ఉంటుందని, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం సర్పంచ్ ఎన్నికల్లో 42% బీసీలకు టికెట్లు కేటాయిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఈ చర్చలో ఆసక్తికర సంఘటన ఏమిటంటే.. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) మద్దతుగా నిలవడం. మంత్రులు పదేపదే మధ్యలో స్పందించడం సరికాదని, ప్రతి సభ్యుడి మాటలను గౌరవించాల్సిన అవసరం ఉందని తలసాని అన్నారు. సభలో చర్చ జరుగుతున్న సమయంలో సభ్యుల మాటలను అడ్డుకోవద్దని సూచించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పాలించినా, గతంలో 55 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్ బీసీల కోసం ఏం చేసిందనే ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ హక్కుల గురించి సభలో చర్చ జరుగుతున్నప్పుడు, ప్రతి ఒక్కరి సూచనలను ప్రభుత్వం వినాలని సూచించారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యేకు బీఆర్‌ఎస్ మద్దతుగా మాట్లాడటం, కాంగ్రెస్ మంత్రులు దీన్ని వ్యతిరేకించడంతో అసెంబ్లీలో ఆసక్తికర పరిమాణం చోటుచేసుకుంది.