Mallareddy: బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కి రెవెన్యూ అధికారులు భారీ షాక్
- By Sudheer Published Date - 12:10 PM, Thu - 7 March 24

మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) కి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) నిద్ర కూడా పోనివ్వడం లేదు. పదేళ్ల పాటు బిఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నప్పుడు అధికార నేతలు తాము ఆడిందే ఆట..పాడిందే పాట గా ఉండేది కానీ ఇప్పుడు అధికారం మారడం తో అసలైన ఆట చూపిస్తున్నారు అధికార పార్టీ కాంగ్రెస్. ముఖ్యంగా మల్లారెడ్డి తన పదవిని అడ్డుపెట్టుకొని విపరీతమైన భూకబ్జాలు చేసారని పెద్ద ఎత్తున ఆరోపణలు , కేసులు నమోదు అయ్యాయి. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మల్లారెడ్డి కబ్జా చేసిన భూమలన్నిటి ఫై విచారణ చేస్తూ..కబ్జా చేసిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే పనిలో పడింది.
We’re now on WhatsApp. Click to Join.
గతంలో చిన్నదామర చెరువులో ఎరోనాటికల్, MLRIT కళాశాలలో స్థలాలు ఆక్రమించినట్లుగా ఫిర్యాదులు రావడంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతం అధికారులతో కలిసి స్థలాలను పరిశీలించారు. ఆక్రమణలు ఉన్నట్లు నిర్ధారించిన కలెక్టర్ అధికారులకు కూల్చివేతలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ గౌతం ఆదేశాలతో గండిమైసమ్మ మండల రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులు. ఈరోజు తెల్లవారుజాము నుంచే భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. దీంతో మర్రి రాజశేఖర్ రెడ్డి సెక్రటరీగా వ్యవహరిస్తున్న ఎంఎల్ఆర్ఐటీ కాలేజీ వద్ద హైటెన్షన్ నెలకొంది. కాలేజీలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు కూల్చివేతను అడ్డుకున్నారు. పలువురు విద్యార్థులు కాలేజీ భవనం పైకి ఎక్కి నినాధాలు చేశారు. కూల్చివేతలు ఆపాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మొహరించారు. విద్యార్థులకు, ఉపాద్యాయులకు నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
Read Also : Election Commission : రాష్ట్ర ప్రభుత్వాలకు ఈసీఐ కీలక సూచనలు