BRS Merger Politics : సరికొత్త ఎన్నికల డ్రామాపై బీఆర్ఎస్ ఫోకస్
BRS Merger Politics : రాజకీయ డ్రామాను ఆంధ్రోళ్లు అంటూ నడిపించడంలో కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఆరితేరిపోయారు.
- By CS Rao Published Date - 04:53 PM, Mon - 2 October 23

BRS Merger Politics : రాజకీయ డ్రామాను ఆంధ్రోళ్లు అంటూ నడిపించడంలో కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఆరితేరిపోయారు. ఇప్పుడు ఆ జాబితాలో మంత్రి గంగులు కమలాకర్ కూడా చేరిపోయారు. ఒక వేళ బీఆర్ఎస్ పార్టీని గెలిపించకపోతే, ఆంధ్రాలో తెలంగాణను కలిపేస్తారని కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపారు. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలను అప్పుడప్పుడు వైసీపీ, బీఆర్ఎస్ లీడర్లు వాడారు. ఆ రెండు పార్టీలు క్విడ్ ప్రో కో వ్యవహారం అందరికీ తెలిసిందే. మూడోసారి అధికారంలోకి రావడానికి మళ్లీ ఆంధ్రాను బూచిచూపించే ప్రయత్నం గంగుల మొదలుపెట్టారు.
ఆంధ్రాలో తెలంగాణను కలిపేస్తారని కొత్త రాజకీయ డ్రామాకు..(BRS Merger Politics)
రాష్ట్ర విడిపోయిన తరువాత వరుసగా రెండుసార్లు ఆంధ్రా సెంటిమెంట్ ను రెచ్చగొట్టడం ద్వారా భావోద్వేగాల నడుమ కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ను నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ సమాజంలేదని సర్వేల సారాంశం. అందుకే, మరోఅడుగు ముందుకేసి ఏకంగా ఏపీలో తెలంగాణ రాష్ట్రాన్ని కలిపేస్తారంటూ (BRS Merger Politics) సాధ్యంకాని అంశాన్ని రాజకీయ అస్త్రంగా మంత్రి గంగుల బయటకు తీసుకురావడం గమనార్హం.
ఆంధ్రా సెంటిమెంట్ ఇప్పుడు వర్కౌట్ కాదని
కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ విచిత్రమైన కామెంట్స్ ను చేశారు. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ను ఫోకస్ చేస్తోన్న గులాబీ నేతలు ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ను వినిపించడం చోద్యం. తెలంగాణ ఉద్యమాన్ని పక్కన పడేసి, ఫక్తు రాజకీయ పార్టీ టీఆర్ఎస్ అంటూ 2014లోనే కేసీఆర్ ప్రకటించారు. ఆ తరువాత బంగారు తెలంగాణ అంటూ సమైక్యవాదులను పార్టీలోకి తీసుకున్నారు.
బంగారు తెలంగాణ అంటూ సమైక్యవాదులను పార్టీలోకి (BRS Merger Politics)
ఆంధ్రా కాంట్రాక్టర్లు మాత్రమే తెలంగాణలోని ప్రాజెక్టులను చేస్తున్నారు. ఇదంతా తెలంగాణ సమాజంకు బాగా తెలుసు. పైగా ఇటీవల తెలంగాణ అనే పదం కూడా పార్టీలో వినిపించకుండా బీఆర్ఎస్ గా మార్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రా సెంటిమెంట్ ను (BRS Merger Politics) ఎంత చెప్పినా ఇప్పుడు వర్కౌట్ కాదని సర్వేల ద్వారా తెలుస్తోది.
Also Read : CBN Arrest Effect : BRS పార్టీలో చీలిక?, `పోచారం` రియాక్షన్ తో అప్రమత్తం!
పొరుగు రాష్ట్రంకు చెందిన ఆంధ్రా నాయకులు షర్మిల, కె.వి.పి. రామచంద్రరావు, ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణపై ఎగబడేందుకు చూస్తున్నారని గంగుల ఉదహరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాకపోతే తెలంగాణను ఆంధ్రాలో కలపడం ఖాయం అంటూ ప్రజల చెవ్వుల్లో పూలుపెట్టేందుకు ఆయన ప్రయత్నం చేయడం విచిత్రం.
కాంగ్రెస్ అధినేత్ర సోనియా చలువతో తెలంగాణ రాష్ట్రం
కొన్ని దశాబ్దాల పోరాటం, కాంగ్రెస్ అధినేత్ర సోనియా చలువతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దాన్ని తిరిగి కలపడం అనేది పెద్ద జోక్. దాన్ని ఎన్నికల అస్త్రంగా మలుచుకోవడం ఇంకా విచిత్రం. ఆయన వ్యాఖ్యల ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ ఏ స్థాయికి దిగజారుతుంది? అనేది అర్థమవుతోంది.
Also Read : KCR vs Modi: మోడీ నుంచి తప్పించుకుంటున్న కేసీఆర్