CM Revanth : ‘దివాలా తీశానని చెప్పుకోవడం నీకే చెల్లింది’ సీఎం కు బిఆర్ఎస్ కౌంటర్
CM Revanth : "చేతగానితనం వల్ల నేను దివాలా తీశానని చెప్పుకోవడం నీకే చెల్లింది మేస్త్రీ" అంటూ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చింది
- By Sudheer Published Date - 11:09 AM, Thu - 13 March 25

శాసనసభా వేదిక(Assembly Platform)గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ “ఊపర్ షేర్వానీ, అందర్ పరేషానీ” అన్నట్లు ఉందని పేర్కొన్న ఆయన, గత ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక నిర్ణయాల ప్రభావంతో ఇప్పుడు రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించేందుకు తగిన వనరులు లేవని, అప్పుల వలన అభివృద్ధి కుంటుపడుతోందని ఆయన స్పష్టం చేశారు.
Holi Bank Holidays: ఈరోజు నుంచి బ్యాంకులకు సెలవులు.. ఏయే రాష్ట్రాల్లో అంటే?
ఈ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ (BRS) ఘాటుగా స్పందించింది. “చేతగానితనం వల్ల నేను దివాలా తీశానని చెప్పుకోవడం నీకే చెల్లింది మేస్త్రీ” అంటూ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు గతంలో ముఖ్యమంత్రి గా ఉన్న రోశయ్య చేసిన కొన్ని వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో రోశయ్య, అప్పట్లో ఆర్థిక సంక్షోభాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రేవంత్ పరిస్థితికి అన్వయించబడ్డాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
Lakshmi Jayanthi 2025: రేపే లక్ష్మిదేవి జయంతి.. ఈ చిన్న మంత్రంతో ఏడాది మొత్తం లాభాలే లాభాలు!
ఈ ఆరోపణలు విమర్శల మధ్య రాజకీయ వేడి పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సమస్యలకు నాటి పాలన కారణమని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుండగా, బీఆర్ఎస్ మాత్రం కొత్త ప్రభుత్వ ఆర్థిక అసమర్థత కారణమని ప్రతిస్పందిస్తోంది. నిజానికి రాష్ట్ర ఖజానా పరిస్థితి, అప్పుల భారాన్ని సమీక్షించి, సమర్థమైన ఆర్థిక విధానాలు అమలు చేయడమే ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలు. రాజకీయ విమర్శల కంటే, ప్రజల అభివృద్ధికి సరైన మార్గం ఎంచుకోవడం కీలకం.
నా చేతగానితనం వల్ల నేను దివాళా తీసాను అని చెప్పుకోవడం నీకే చెల్లింది మేస్త్రి! pic.twitter.com/Gl609LyKoI
— BRS Party (@BRSparty) March 12, 2025