Andole: ఆత్మీయ సమ్మేళనంలో అందోల్ ఎమ్మెల్యే చంటి
రేగోడ్ మండల్ కేంద్రంలోనీ బసవేశ్వర మరియు గాంధీ విగ్రహాలకు పూలమాల సమర్పించి భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో లంబాడీ సంప్రదాయ నృత్యాలు చేస్తూ
- By Praveen Aluthuru Published Date - 08:18 PM, Tue - 16 May 23

Andole: రేగోడ్ మండల్ కేంద్రంలోనీ బసవేశ్వర మరియు గాంధీ విగ్రహాలకు పూలమాల సమర్పించి భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో లంబాడీ సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను ఎడ్ల బండి పై ఉరేగించుకుంటు భారీ ర్యాలీగా సభాస్థలి చేరుకున్నారు. మధ్యలో అంబేడ్కర్ విగ్రహానికి భూమి పూజ చేసి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిచారు ఆత్మీయ సమ్మేళనం ప్రారంభానికి ముందుగా అమరవీరులను గుర్తుచేసుకుంటూ కాసేపు మౌనం పాటించారు. జలదృష్యం లో టి ఆర్ ఎస్ ఏర్పడ్డప్పుడు తెలంగాణ సిద్ధించే వరకు తన కాళ్ళకు చెప్పులుతోడగను అని ట్యాంక్ బ్యాండ్ పై చెప్పులు వదిలి చనిపోయేవరకు చెప్పులు వేసుకోని కి. శే బక్కన్న ను స్మరించుకుంటూ అమరులకు నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి పునాది అని, ఏ ఆపద వచ్చినా కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు కార్యకర్తలకు నాయకులకు మధ్య అనుబంధాన్ని పెంచుతాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ముందు చూపుతో మునుపేన్నడు లేనివిధంగా నియోజకవర్గం అభివృద్ధి పధంలో ముందుకు సాగుతుందని తెలిపారు. సింగూరు నీళ్ళు కింది వాళ్ళు తీసుకెలుతుంటే, బొరంచ లిఫ్ట్ తో అందోల్ కు చుక్కనీరు అందనీయకపోతే ఆనాటి డిప్యూటీ సీఎం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకని ఆయన ప్రశ్నించారు. నేను ఎమ్మెల్యేగా గెలిచాక అందోల్ నియోజకవర్గానికి సాగునీరు అందించే అద్భుతమైన బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ కు కేసిఆర్ రూపకల్పన చేశారని ఆయన అన్నారు. దీని ద్వారా రైతులకు లక్షల ఎకరాలకు నీరందబోతుందని ఎమ్మెల్యే చెప్పారు.
చీటికి మాటికి నేను JNTU తెచ్చా లేదంటే వాట్ పల్లి మార్కెట్ యార్డ్ తెచ్చా అని గొప్పలు చెప్పుకునే దామోదర భూములు కోల్పోయిన వారికి ఇప్పటివరకు నష్టపరిహారం ఎందుకు ఇప్పియలేదని ప్రశ్నించారు. తెలంగాణాలో అప్పుడు మంజూరైనా వాటిలో అందోల్ JNTU ఒకటని, సపరేట్ గా ఆయన చేసిందేమి లేదన్నారు. రాబోయే రోజుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని భూములు కోల్పోయిన రైతులకు ఒక్కొక్కరికి పదిహేను లక్షల చొప్పున నష్టపరిహారం కెసిఆర్ గారి సహకారంతో ఇప్పించడం జరుగిందని అన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ గారి కృషితో జరిగే సంక్షేమ పథకాలను,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే భాద్యత ప్రతి ఒక్క కార్యకర్తలపై నాయకులపై వుందని క్రాంతి కిరణ్ అన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు భోజనం వడ్డీంచి వారితోపాటు కలిసి భోజనం చేసారు ఈ కార్యక్రమానికి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సుంకే రమేష్ అధ్యక్షత వహించగా మండల సీనియర్ నాయకులు కిషన్ రెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు వినోద్, సర్పంచ్ ల ఫోరం కన్వీనర్ రవీందర్, ఫ్యాక్స్ ఛైర్మెన్ రాజు తో పాటు సీనియర్ నాయకులు MPTC నర్సింహులు అన్ని గ్రామాల అధ్యక్షులు సర్పంచ్ లు ఎంపీటీసీ లు డైరెక్టర్ లతో పాటు, సీనియర్ నాయకులు జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
Read more: Aadhaar: ఆధార్ కార్డు పోయిందా.. అయితే భయపడాల్సిన పనిలేదు.. ఈ ఒక్క పని చేస్తే చాలు?