Bomb : వరంగల్ జిల్లా కోర్టులో బాంబు కలకలం
Bomb : ఉదయం 9 గంటల సమయంలో జిల్లా జడ్జికి అనేకసార్లు కాల్ చేసిన ఆగంతకుడు, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు పంపాడు
- By Sudheer Published Date - 05:56 PM, Fri - 4 April 25
వరంగల్ జిల్లా కోర్టు ప్రాంగణం(Warangal Highcourt)లో శుక్రవారం ఉదయం భారీ కలకలం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి జిల్లా జడ్జికి బాంబు (Bomb) పెట్టినట్లు మెయిల్ చేయడంతో అధికారులు హుటాహుటిన స్పందించారు. ఉదయం 9 గంటల సమయంలో జిల్లా జడ్జికి అనేకసార్లు కాల్ చేసిన ఆగంతకుడు, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు పంపాడు. కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు, అది ఏ క్షణమైనా పేలిపోవచ్చని మెయిల్‌లో పేర్కొనడం తీవ్ర కలవరానికి దారి తీసింది.
Ram Charan : ‘పెద్ది’ డైరెక్టర్ చరణ్ ఏ గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..?
ఈ సమాచారం తెలిసిన వెంటనే సురక్షిత చర్యల్లో భాగంగా సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ను ఘటనాస్థలికి పిలిపించారు. వారు జిల్లా కోర్టు మూడో అంతస్తులో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్రతీ మూమూలు ప్రదేశాన్ని శోధించినా, ఎలాంటి పేలుడు పదార్థాలు కనబడలేదు. పూర్తిగా తనిఖీలు చేసి ఇది తప్పుడు సమాచారం అని పోలీసులు తేల్చారు. ఎటువంటి బాంబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఫోన్ కాల్స్, మెయిల్స్ పంపిన వ్యక్తి ఎవరు అనే దానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.