Arvind Dharmapuri: ఎంపీ అర్వింద్ పై కేసు నమోదు
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును దుర్భాషలాడడం, రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారన్న
- Author : Balu J
Date : 20-07-2022 - 5:26 IST
Published By : Hashtagu Telugu Desk
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును దుర్భాషలాడడం, రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారన్న ఆరోపణలపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురిపై సరూర్‌నగర్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. జూలై 13న నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఎంపీ ముఖ్యమంత్రితో పాటు ఇతర వ్యక్తులను దుర్భాషలాడారని పేర్కొంటూ నగరానికి చెందిన న్యాయవాది రవికుమార్ సరూర్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఎంపీ ప్రసంగాన్ని యూట్యూబ్‌లో చూశానని న్యాయవాది చెప్పారు. ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు అరవింద్ ధర్మపురిపై ఐపిసి సెక్షన్ 504 మరియు 505 (1) (సి) కింద కేసు నమోదు చేశారు.