MLA Raja Singh : అమర్నాథ్ యాత్రలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. తృటిలో తప్పిన ప్రమాదం
అమర్‌నాథ్ లో భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.అమర్‌నాథ్ గుహ సమీపంలో భారీ వరద రావడంతో పలువురు నీటిలో కొట్టుకుపోయారు.
- By Prasad Published Date - 07:10 AM, Sat - 9 July 22

అమర్‌నాథ్ లో భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.అమర్‌నాథ్ గుహ సమీపంలో భారీ వరద రావడంతో పలువురు నీటిలో కొట్టుకుపోయారు. ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు.
అయితే అమర్‌నాథ్ యాత్రలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. ఆయన ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వరద ముంచెత్తిన సమయంలో రాజాసింగ్ సమీపంలోనే ఉన్నట్లు ఆయన తెలిపారు. వరద స్పాట్ నుంచి బయటకు వచ్చిన పది నిమిషాల్లోనే.. వరదలు వచ్చాయని రాజాసింగ్ తెలిపారు. అమర్నాథ్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో కశ్మీర్ పోలీసులు రాజాసింగ్ ను అలర్ట్ చేశారు.
వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో చాపర్ లో వెళ్లేందుకు అనుమతించ లేదు. దీంతో రాజాసింగ్ చాపర్ ను రద్దు చేసుకున్నారు. మరోవైపు రాజాసింగ్ కు ట్రెత్ ఉండటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పటిష్ట భద్రత నడుమ పోలీసులు రాజాసింగ్ ను శ్రీనగర్ కు తరలిస్తున్నారు.