HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bjp Has Made The Country A Jobless India Minister Ktr Said

KTR: దేశాన్ని నిరుద్యోగ భారతంగా తయారుచేసిందే బీజేపీ- మంత్రి కేటీఆర్

దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని యువతను నమ్మి మోసం చేసిన వాడే నరేంద్ర మోదీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ధ్వజమెత్తారు.

  • Author : Balu J Date : 31-10-2023 - 6:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KT Rama Rao
Telangana Minister KTR America Tour

KTR: దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని యువతను నమ్మి మోసం చేసిన వాడే నరేంద్ర మోదీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ధ్వజమెత్తారు. అసలు దేశాన్ని  నిరుద్యోగ భారతంగా తయారుచేసిందే బీజేపీ అని, ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి నియామకాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఈ మేరకు కిషన్ రెడ్డిపై మండి పడ్డారు. బీజేపీ పాలనలో.. మొత్తం భారతదేశమే ఒక బేరోజ్ గార్ మేళాగా మారిపోయిందని మండిపడ్డారు. మోదీ ఇచ్చిన హామీలన్నీ పేకమేడలేనని తేలిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2014 లో మోదీకి దేశప్రజలు ప్రధానిగా ఉద్యోగం ఇచ్చినప్పటి నుంచే దేశంలో యువతకు కష్టాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీచేస్తామని ఆశచూపి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ దేశంలోని యువతీ యువకులను నిలువునా మోసం చేశారు. గత తొమ్మిదేళ్లలో ఏడాదికి రెండు కోట్ల చొప్పున 18 కోట్ల ఉద్యోగాల నియామకాలు చేపట్టనందుకు యువతకు బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.

దేశ చరిత్రలోనే 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగిత ప్రధాని మోదీ హయాంలోనే నమోదుకావడం అత్యంత సిగ్గుచేటు అని కేటిఆర్ విమర్శించారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీ కన్నా ఎక్కువగా ఉద్యోగాలు భర్తీచేసిన ప్రభుత్వం మాదన్నారు. ఇప్పటికే 1,60,000 ఉద్యోగాలను భర్తీ చేసి.. మరో 70,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా పూర్తికాబోతోందన్నారు. అసలు నియామక ప్రక్రియలో జాప్యానికి కారణమే బీజేపీ. పకడ్బందీగా నిర్వహిస్తున్న పరీక్షలకు భంగం కలిగించేందుకు ప్రశ్నాపత్రాల లీకేజీ కుట్రకు తెరలేపింది బీజేపీయేనని తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ఆగం చేసేలా పేపర్ లీకేజీకి పాల్పడింది మీ పార్టీ ఎంపీ, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడే అనే విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిదని కిషన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. మరోవైపు అక్రమ కేసులు వేయిస్తూ.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్న మీ బీజేపీ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు.

తెలంగాణ యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే ఐటీఐఆర్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును రద్దుచేసిన బీజేపీ ప్రభుత్వం యువతీ యువకుల భవిష్యత్తును దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.  విభజన హామీల్లో ఒకటైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీ అమలుచేసి ఉంటే.. ఎంతోమంది యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు లభించేవని అన్నారు. ముఖ్యంగా గిరిజన, ఆదివాసీ బిడ్డలకు కొత్తగా అవకాశాలు లభించేవని, వారికి అన్యాయం చేసిన బీజేపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అలాగే దశాబ్దాల కల అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి కూడా కేంద్ర ప్రభుత్వం చరమగీతం పాడిందని మండిపడ్డారు. కేంద్రమంత్రిగా ఒక్కనాడైనా తెలంగాణ విభజన హక్కుల గురించి కిషన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని సూటిగా ప్రశ్నించారు.

సహాయ మంత్రిగా కాకుండా.. నిస్సహాయ మంత్రిగా మారిపోయిన కిషన్ రెడ్డి వల్ల తెలంగాణ యువతకు ఒరిగిందేమీ లేదని ధ్వజమెత్తారు. వినూత్న ఆలోచనలు, విప్లవాత్మక పారిశ్రామిక విధానాలతో తెలంగాణను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చడం వల్ల యువతకు ఆకాశమే హద్దుగా అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. జాతీయ స్థాయిలో సరికొత్త పంథాలో ఇలాంటి నిర్ణయాలు లేకపోవడం వల్ల దేశ యువతకు తీవ్ర నష్టం జరుగుతోందని స్పష్టంచేశారు. గత పదేళ్ల ప్రస్థానాన్ని చూస్తే.. కేంద్రంలోని బీజేపీది ఉత్త మాటల ప్రభుత్వం.. తెలంగాణలో ఉన్నది చేతల ప్రభుత్వం అనే విషయం ప్రజలకు అర్థమైపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వ అర్థరహితమైన ఆర్థిక విధానాలు, నోట్లరద్దు, లాక్ డౌన్ వంటి చర్యలతో ఉపాధి కల్పనను ఘోరంగా దెబ్బతీసిన పాపం బీజేపీదేనని దుయ్యబట్టారు. కొత్త ఉద్యోగాల కల్పన దేవుడెరుగు.. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఉన్న ఉద్యోగాలు ఊడి.. యువత రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.

దమ్ముంటే గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసినన్ని ఉద్యోగాలను దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా భర్తీ చేసిందా కిషన్ రెడ్డి చెప్పాలని సవాల్ విసిరారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందో లెక్కలతో సహా చెప్పగలరాఅన్నారు. కిషన్ రెడ్డి భాగస్వామిగా ఉన్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం  పదేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలెన్ని, ఆయా శాఖల వారీగా ఉన్న ఖాళీలెన్ని అనే విషయంపై శ్వేత పత్రం విడుదల చేసి దమ్ముందాఅని సవాలు విసిరారు. 16 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకుని ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం పైన, మా పార్టీ పైన విమర్శలు చేయడం మీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం కాదా అన్నారు.

ఓవైపు కేంద్రంలో ఉన్న ఖాళీలను నింపకుండా అన్యాయం చేయడమే కాకుండా.. ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం దారుణమని మండిపడ్డారు. ఫలితంగా రాజ్యాంగ నిర్మాత కల్పించిన రిజర్వేషన్ హక్కులను ఎస్సీ ఎస్టీ యువతీ యువకులు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నియామక పరీక్షలను హిందీలో నిర్వహించడం వల్ల వివిధ రాష్ట్రాల యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందనే విషయాన్ని మేము మీ దృష్టికి తెచ్చే వరకూ మీకు కనీసం సోయి లేకపోవడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు.

తెలంగాణ నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తూ వారిని రాజకీయాలకు వాడుకునే కుట్రలకు ఇప్పటికైనా కిషన్ రెడ్డి ముగింపు పలికాలన్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా చేపట్టడంతోపాటు.. దేశంలోనే అత్యధికంగా ప్రైవేటురంగంలో ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం తెలంగాణ అనే విషయాన్ని కిషన్ రెడ్డి తెలుసుకుంటే మంచిది. ఓవైపు ఐటీ, మరోవైపు మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా వంటి అనేక కీలక రంగాల్లో 24 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం మాది. దేశంలోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు తెలంగాణ అక్షయపాత్రగా మారిందని అనేక ప్రఖ్యాత సంస్థలు కితాబు ఇస్తుంటే.. మీరు ఓర్వలేకపోతున్నారని అర్థమవుతోంది. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కనీస సహకారం లేకున్నా ఈ మహాయజ్ఞాన్ని విజయవంతంగా కొనసాగిస్తాం.. యువత ఆకాంక్షల్ని సంపూర్ణంగా  నెరవేరుస్తామన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP Govt
  • hard comments
  • hyderabad
  • ktr

Related News

Duvvada Arrest

Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. దువ్వాడ మాధురి, శ్రీనివాస్ అరెస్ట్?

Farmhouse Liquor Party: మొయినాబాద్‌లోని 'ది పెండెంట్' ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా నిర్వహించిన మద్యం పార్టీ పెద్ద కలకలం సృష్టించింది. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు ఆయన భార్య మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

  • Nbw Issued Against Minister

    Konda Surekha : మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

  • Lionel Messi Photo

    Lionel Messi in HYD: వామ్మో ..మెస్సీ తో ఫోటో దిగాలంటే రూ.9.95లక్షలు చెల్లించాలి !!

  • Gold And Silver Rate Today

    Gold Price : ఈరోజు బంగారం ధర తగ్గింది.. సిల్వర్ రేటు పెరిగింది !

  • Global Summit

    Global Summit: గ్లోబల్ సమ్మిట్‌.. తెలంగాణ‌కు వ‌చ్చిన పెట్టుబ‌డులు ఎంతంటే?!

Latest News

  • Vizag : వైజాగ్ లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన కంపెనీల వివరాలు

  • Divi Vadthya Bikini : బికినీ లో ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసిన దివి

  • Greenfield Highway Works : తెలంగాణలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు ప్రారంభం

  • Telangana- ASEAN Partnership: తెలంగాణ లో పెట్టుబడులు పెట్టాలంటూ ASEAN కంపెనీలను ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్

  • New Features in Whatsapp : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు

Trending News

    • Akhanda 2 Roars At The Box Office : బాలయ్య కెరీర్లోనే అఖండ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.. శివ తాండవమే..!

    • Akhanda 2 Review : బాలయ్య అఖండ 2 మూవీ రివ్యూ!

    • Sarpanch Salary: తెలంగాణలో సర్పంచుల వేతనం ఎంతో తెలుసా?!

    • Indigo Flight: ఇండిగో ప్రయాణికులకు రూ. 10,000 ట్రావెల్ వోచర్!!

    • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd