Chenchu Woman Incident : నిమ్స్ హాస్పిటల్లో ఈశ్వరమ్మకు పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి
చెంచు గిరిజన మహిళ ఈశ్వరమ్మ పై జరిగిన అత్యాచారం ఘటన అమానవీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు
- By Sudheer Published Date - 12:37 PM, Mon - 24 June 24

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లికి చెందిన చెంచు గిరిజన మహిళ ఈశ్వరమ్మ (Chenchu Woman Eswaramma) పై జరిగిన అత్యాచారం ఘటన అమానవీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మల్లు అన్నారు. నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితురాలు ఈశ్వరమ్మను కుటుంబ సభ్యులను నేటి ఉదయం పరామర్శించిన అనంతరం ఆయన స్థానికంగా మంత్రి జూపల్లితో కలిసి మీడియాతో మాట్లాడారు.
మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి సైతం తరలించారని భట్టి విక్రమార్క అన్నారు. ఈ ఘటన విషయాన్ని మంత్రి జూపల్లి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. బాధితురాలు పూర్తిగా ఆరోగ్యంతో కోలుకునే వరకు ఉచితంగా ప్రభుత్వపరంగా వైద్య సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. గ్రామంలో ఇల్లు లేని పక్షంలో ఇందిరమ్మ ఇల్లు, ఇద్దరు పిల్లలను ఆశ్రమ పాఠశాలలో ఎంతవరకు చదివితే అంతవరకు చదివించడమే కాకుండా సాగుకు యోగ్యమైన వ్యవసాయ భూమి కేటాయించడం వంటి అన్ని చర్యలు ప్రభుత్వపరంగా చేపడతామని భరోసా ఇచ్చారు. చెంచు మహిళపై దాష్టీకం మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు తలదించుకునే ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం తీవ్రంగా ఖండించాల్సిన అంశమని అభిప్రాయపడ్డారు.
We’re now on WhatsApp. Click to Join.
అసలు ఏంజరిగిందంటే..
బాధిత చెంచు మహిళ ఈశ్వరమ్మ భర్త ఈదన్న వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ కౌలుకు తీసుకున్నాడు. అదే పొలంలో భూమి యజమానులైన ఈశ్వరమ్మ, ఈదన్నతో కూలీ పని చేయిస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తలు గొడవపడటంతో ఈశ్వరమ్మ తన తల్లి గారి ఊరు చుక్కాయపల్లికి వెళ్లింది.
విషయం తెలుసుకున్న వెంకటేశ్ తల్లి గారి ఇంటి నుంచి ఈశ్వరమ్మను మొలచింతపల్లి గ్రామానికి తీసుకొచ్చి తన ఇంట్లో బంధించాడు. వెంకటేశ్ తన భార్య శివమ్మ, బాధితురాలి బంధువు లక్ష్మమ్మ భర్త లింగస్వామితో కలిసి ఆమెపై తీవ్రంగా దాడి చేశారు. పది రోజుల కిందట దాడి జరగగా శరీరంపై కాల్చిన గాయాలున్నాయి. అప్పటి నుంచి ఇంట్లోనే పెట్టి గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీతో వైద్యం అందించారు. విషయం తెలుసుకున్న ఈదన్న గ్రామస్థులతో కలిసి ఈదమ్మను పంపించమని కోరగా వెంకటేశ్ బెదిరింపులకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెళ్లి బాధితురాలిని ఇంటికి తీసుకొని రాగా ఈ దారుణం బయటకు వచ్చింది.
Read Also : Relationship : భార్యాభర్తల మధ్య వయసు అంతరం ఎందుకు ఉండకూడదో తెలుసా..?