HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Bandi Sanjay Strongly Reacts Against Kcr On Cantonment Issue

Telangana BJP: ‘టచ్ చేసి చూడు…. మాడి మసైపోతావ్ ‘కేసీఆర్’ – ‘బండి సంజయ్’

కంటోన్మెంట్ ఏరియాకు నీళ్లు, కరెంట్ కట్ చేస్తామంటూ అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.

  • By Hashtag U Published Date - 09:06 PM, Sun - 13 March 22
  • daily-hunt
Bandi
Bandi

కంటోన్మెంట్ ఏరియాకు నీళ్లు, కరెంట్ కట్ చేస్తామంటూ అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. భారత సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించడం అత్యంత దుర్మార్గమని, ఇది ముమ్మాటికీ దేశద్రోహ చర్యేనని మండిపడ్డారు. పాతబస్తీలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన కరెంట్ బిల్లులను వసూలు చేయడం చేతగాని దద్దమ్మ కంటోన్మెంట్ కు కరెంట్, నీళ్లు కట్ చేస్తామని చెప్పడం సిగ్గు చేటు. దేశాన్ని విచ్చిన్నం చేసేలా మాట్లాడుతున్న కేసీఆర్ కుటుంబం ముమ్మాటికీ దేశద్రోహులేనని అభివర్ణించారు. ఇలాగే దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తే….. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఉరికించి ఉరికించి కొట్టడం ఖాయమని… తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్ వద్ద మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు బండి సంజయ్.

కంటోన్మెంట్ లో కరెంట్ కట్ చేస్తారా? అసలు కేసీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటి? కంటోన్మెంట్ లో భూములు కబ్జాలు చేయాలి. ఫాంహౌజ్ లు కట్టుకోవాలి. పన్నులు పెంచాలి. నిధులు మళ్లించాలి. పేద ప్రజల రక్తం తాగాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లున్నారు.కేసీఆర్ కుటుంబాన్ని చూస్తుంటే నాకు అనుమానం వస్తోంది. వారందరికీ డీఎన్ఏ టెస్ట్ చేయాలి. ఒకాయనమో చైనాకు సపోర్ట్ చేస్తాడు. ఇంకోకాయన పాకిస్తాన్ కు, ఆఫ్ఝనిస్తాన్ కు సపోర్ట్ చేస్తారు. రష్యా-ఉక్రెయిన్ యుద్దం జరిగితే అక్కడ మన విద్యార్థులు అల్లాడుతుంటే కనీసం స్పందించరు అని విమర్శించారు బండి సంజయ్.
కంటోన్మెంట్ లో సైనికులతోపాటు తెలంగాణ ప్రజలు కూడా నివాసం ఉంటారనే సోయి మర్చిపోయాడు. దేశంలో అన్ని ఉగ్రవాద సంస్థలకు నెంబర్ వన్ టార్గెట్ గా ఉన్న ప్రాంతమది. అక్కడే కరెంట్, నీళ్లు కట్ చేస్తారా? మీరేమైనా రజాకార్లా? నిజాం వారసులా? అని తీవ్రస్థాయిలో కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు బండి సంజయ్.
కంటోన్మెంట్ నీ అయ్య జాగీరనుకున్నావా? దమ్ముంటే…కరెంట్ కట్ చేసి చూడు…. తెలంగాణ ప్రజలు ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు. బలుపెక్కి బరితెగించి మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామా? ఖబడ్దార్… మాడి మసైపోతావ్ అని హెచ్చరించారు బండి సంజయ్.
పాతబస్తీలో 80 శాతం కరెంట్ బిల్లులు ఏళ్లతరబడి బకాయి ఉంటే కరెంట్ కట్ చేయడం చేతగాని దద్దమ్మలు… కంటోన్మెంట్ లో కరెంట్, నీళ్లు కట్ చేస్తామని చెప్పడం సిగ్గు చేటు. నువ్వు కరెంట్ కట్ చేస్తే… తెలంగాణ ప్రజలు నీ పవర్ కట్ చేయడం ఖాయమని చెప్పారు బండి. ఇలాంటి విచ్చిన్నకర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ కుటుంబం దేశ ద్రోహ కుటుంబమే. ఇలాంటి వ్యాఖ్యలతో అసలు సమాజానికి ఏం చెప్పదల్చుకున్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి దేశద్రోహ వ్యాఖ్యలు చేస్తుంటే… మిగిలిన పార్టీలు ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు బండి సంజయ్. మీ అయ్య (కేసీఆర్) ఫాంహౌజ్ కు పోతుంటే… ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ బంద్ చేస్తారు? షాప్స్, హోటల్స్, వ్యాపారాలన్నీ బంద్ చేస్తారు? ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు. నీవల్ల పోలీసులు కూడా రేయింబవళ్లు నీకు బందోబస్తు చేయలేక రోడ్లపై నానా గోస పడుతున్నారు. డబ్బులు దండుకోవడానికి అలవాటుపడ్డ కేసీఆర్ కుటుంబం ఇటీవల కాలంలో అడ్డగోలుగా మాట్లాడుతోంది. కంటోన్మెంట్ విషయంలో ఏదైనా సమస్య ఉంటే కూర్చుని చర్చల ద్వారా, సమావేశాలు నిర్వహించి పరిష్కరించుకోవాలి. కంటోన్మెంట్ బోర్డు అధికారులతో ఎన్నిసార్లు సమావేశమయ్యారు? ఇదేదో అంతర్జాతీయ సమస్య కాదు కదా…అని అన్నారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికైనా సీఎం స్పందించాలి. దేశ సైనికులకు, వీర సైనికుల కుటుంబాలకు, రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ స్వయంగా క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో దేశంలో విచ్చిన్నకర శక్తులుగా కేసీఆర్ కుటుంబం మిగిలిపోవడం ఖాయం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలంతా ఒక్కసారి ఆలోచించాలి. ఇదే అంశంపై బీజేపీ పక్షాన యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాం. న్యాయపరమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు బండి సంజయ్.

‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమా భేష్:

అంతకుముందు బండి సంజయ్ పార్టీ నేతలతో కలిసి ప్రసాద్ ల్యాబ్ లో ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమా తిలకించారు. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన వాస్తవ విషయాలను ప్రజలకు తెలియజేయాలనే దృఢ నిశ్చయంతో ఈ సినిమాను నిర్మించిన వివేక్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్ లను మనస్పూర్తిగా అభినందించారు. కాశ్మీర్ పండిట్ల, హిందువులపై జరిగిన ఊచకోతను, జిహాదీ పేరుతో తీవ్రవాదులు సాగిస్తున్న మారణకాండను కళ్లకు కట్టినట్లు చూపించారని కొనియాడారు. ప్రజల్లో అయోమయం సృష్టిస్తూ మతపరమైన సమస్యగా చిత్రీకరిస్తున్న కుహానా శక్తులు, కాంగ్రెస్ పార్టీ నేతలకు ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమా చూసిన తరువాతైనా కనువిప్పు కలగాలని అన్నారు. అసలైన దేశ భక్తులెవరు? దేశ ద్రోహులెవరు? దేశం కోసం త్యాగాలు చేసేవారెవరు? అనే విషయాలు ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేసిన వివేక్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్ ను అభినందించారు బండి సంజయ్. దేశం ఎక్కడికి పోతే నాకేంటి? నాకు రాజకీయాలు, నా కుటుంబం ముఖ్యమని భావించే వాళ్లంతా ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమా చూడాలని కోరారు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • chief minister KCR
  • Secunderabad Cantonment
  • Telangana BJP

Related News

BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

BRS : కాళేశ్వరం అవినీతికి బాధ్యులు బీఆర్‌ఎస్‌ నేతలే : బండి సంజయ్‌

బీజేపీ ఎప్పటి నుంచో కాళేశ్వరం అవినీతి అంశంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వస్తోంది. కానీ అప్పట్లో కాంగ్రెస్ మౌనం సంతరించుకుంది. ఇప్పుడు మాత్రం అవినీతికి తలవంచి సీబీఐకి అప్పగించేందుకు సిద్ధమవడం ఆశ్చర్యంగా లేద అన్నారు.

    Latest News

    • Congress : ప్రభుత్వం మారితేనే న్యాయం జరుగుతుందేమో..? – రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

    • Kutami Super 6 : అనంతపురంలో ఈ నెల 10న సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ

    • Nara Lokesh : శ్రీ ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేశ్

    • TTD: రేపు ఎన్నిగంట్లకు టీటీడీలో దర్శనమంటే.?

    • Venezuela : కరేబియన్‌లో ఉద్రిక్త వాతావరణం: వెనుజువెలా ఆక్రమణకు అమెరికా సిద్ధం..!

    Trending News

      • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd