HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bandi Sanjay Comments Brs

Bandi Sanjay : ప్రధాని పర్యటనతో ప్రగతి భవన్ లో భూకంపం వచ్చిందంటూ బండి సంజయ్ సెటైర్లు

కేసీఆర్ ఇంట్లోకి రానివ్వడం లేదని..కేసీఆర్ అల్లుడు నిన్న టీవీ పగుల గొట్టారని కల్వకుంట్ల కుటుంబం లో లొల్లి స్టార్ట్ అయ్యింది

  • Author : Sudheer Date : 04-10-2023 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bandi Sanjay Kcr
Bandi Sanjay Kcr

మాజీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay ) మరోసారి తనదైన స్టయిల్ లో బిఆర్ఎస్ (BRS) ఫై మాటల తూటాలు పేల్చారు. తెలంగాణ లో ఎలాగైనా కాషాయం జెండా ఎగురవేయాలని బిజెపి నేతలు చేయని ప్రయత్నం లేదు. మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతుండడం తో ప్రధాని మోడీ (PM Modi) దగ్గరి నుండి కేంద్ర మంత్రులు వరుస తెలంగాణ పర్యటనలు ప్లాన్ చేస్తూ..కార్యకర్తల్లో జోష్ పెంచుతున్నారు. రీసెంట్ గా ప్రధాని మోడీ నిజామాబాద్, మహబూబ్ నగర్ లో పర్యటించి పలు అభివృద్ధి కార్య క్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే క్రమంలో అధికార పార్టీ బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల ఫై పలు విమర్శలు చేసారు. ఈ విమర్శలకు బిఆర్ఎస్ సైతం కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టింది.

ఈ క్రమంలో బండి సంజయ్ బిఆర్ఎస్ ఫై విరుచుకపడ్డారు. ప్రధాని పర్యటనతో ప్రగతి భవన్ లో భూకంపం వచ్చిందంటూ సెటైర్లు వేశారు. ప్రధాని మోడీ ఫై మంత్రి కేటీఆర్ (KTR) విషాన్ని నింపుకున్నారంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ (KCR) ఇంట్లోకి రానివ్వడం లేదని..కేసీఆర్ అల్లుడు నిన్న టీవీ పగుల గొట్టారని కల్వకుంట్ల కుటుంబం లో లొల్లి స్టార్ట్ అయ్యింది అంటూ బండి సంజయ్ విమర్శలు సంధించారు. గత 15 రోజుల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM Missing) కనిపించడం లేదని, కేసీఆర్‌ మిస్సింగ్‌ తమను ఆందోళనకు గురిచేస్తోందని సెటైర్లు వేశారు. కేసీఆర్‌ దగ్గరకు ఎవరనీ వెళ్లనీయడం లేదని, చివరికి ఎంపీ సంతోష్‌ కుమార్‌ను కూడా దూరం పెట్టారని విమర్శించారు. కేటిఆర్ భాష చూసి తెలంగాణ సిగ్గు పడుతుందని..బిడ్డా కేటీఆర్.. మేం తిట్టడం స్టార్ట్ చేస్తే.. తట్టుకోలేవ్’’అంటూ బండి సంజయ్ హెచ్చరించారు. కేటీఆర్ సీఎం అభ్యర్థి అయితే.. ఎమ్మెల్యేలు బయటకు వస్తారని బండి సంజయ్ అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నిజామాబాద్‌ సభలో చేసిన మోడీ వ్యాఖ్యలపై కేసీఆర్‌ సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. 2009లో ఎన్డీయే ర్యాలీలో కేసీఆర్ పాల్గొన్నది నిజం కాదా అని నిలదీశారు. ‘ఉద్యమ సమయంలో తండ్రిని చంపేస్తారా మాకేమొస్తుందని మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు జై తెలంగాణా అని మంత్రి పదవిలో కూర్చుండు. ఇంతకంటే చీటర్ ఇంకెవరుంటారు. ఉద్యమ సమయంలో మీ ఆస్తులెంత..? ఇప్పుడు మీ ఆస్తులెంత..? తెలంగాణా సమాజం కేసీఆర్ కుటుంబం ఆస్తులు కొల్లగొడుతున్న విధానాన్ని గమనించాలి’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని అనేకసార్లు బయటపడిందన్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో జాయిన్ అవుతారని అన్నారు.

Read Also : BRS Minister: కేసిఆర్ పై మోడీ అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు: మంత్రి ప్రశాంత్ రెడ్డి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • brs
  • cm kcr
  • ktr
  • modi tour
  • pragathi bhavan

Related News

Jeevan Reddy Brs

BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన 'ప్రజా ఆశీర్వాద సభ'లో పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన అధికారికంగా గులాబీ కండువా కప్పుకున్నారు. కేవలం జీవన్ రెడ్డి మాత్రమే కాకుండా, ఆయన వెంట సుమారు 40 మంది బలమైన అనుచర గణం

  • Harish Rao Kmm

    Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

Latest News

  • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

  • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

  • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd