Maoist Sexual Harassment: మావోయిస్టులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు: మావోయిస్టు నాయకురాలు
మావోయిస్టులు అంటేనే ఆదర్శ భావాలున్న వ్యక్తులు.. సమాజంలో అన్యాయం పెట్రోగిపోతున్నప్పుడు ప్రశ్నించే గొంతుకలు.
- By Hashtag U Published Date - 12:54 PM, Sat - 24 September 22

మావోయిస్టులు అంటేనే ఆదర్శ భావాలున్న వ్యక్తులు.. సమాజంలో అన్యాయం పెట్రోగిపోతున్నప్పుడు ప్రశ్నించే గొంతుకలు. అలాంటి మావోయిస్టులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారా.. అంటే అవుననే అంటోంది మాజీ మావోయిస్టు నాయకురాలు. ఖమ్మం జిల్లా చెర్ల అటవీ ప్రాంతం నుంచి అరెస్టయిన కొద్ది రోజులకే మహిళా మావోయిస్టు నాయకురాలు మడకం కోసి బృందంలోని మహిళలపై వేధింపుల గురించి కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. మావోయిస్టు నేత కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ పార్టీలో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని, గిరిజన వర్గాల మైనర్ బాలికలపై దోపిడీకి పాల్పడుతున్నాడని మావోయిస్టు నాయకురాలు ఆరోపించింది.
ఆజాద్ భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తదుపరి వివరాలను అందజేస్తూ విచారణలో మడకం కోసి వాంగ్మూలం ఆధారంగా ఆజాద్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ వినీత్ జి తెలిపారు. “మావోయిస్ట్‌లు గిరిజన ప్రజలను ముఖ్యంగా మైనర్లను వేధిస్తున్నారని, దోపిడీ చేస్తున్నారని కోసి వెల్లడించారు. ఇటీవల మావోయిస్టుల్లో చేరిన మహిళలను ఆజాద్ లైంగికంగా వేధించాడని ఆమె తెలిపింది.