Pawan Kalyan : ఈ నెల 29న కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో పవన్ మరోసారి కొండగట్టు అంజన్నను దర్శించుకుంటున్నారు
- By Sudheer Published Date - 01:09 PM, Wed - 26 June 24

ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ నెల 29 న కొండగట్టు (Kondagattu) అంజన్న ను దర్శించుకోబోతున్నారు. ఈ మేరకు అయన పర్యటన కు సంబదించిన షెడ్యూల్ విడుదలైంది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏ విజయం తర్వాత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి తో పాటు పలు శాఖలకు మంత్రిగా బాధ్యత వహించారు. దీంతో గత కొన్ని రోజులుగా ఆయన తన మంత్రిత్వశాఖల రివ్యూ మీటింగులతో బిజీ..బిజీ గా గడుపుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె ఈ నెల 29న ఆయన కొండగట్టుకు రానున్నారు. శనివారం నాడు ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. 11 రోజుల పాటు కొనసాగనున్న ఈ దీక్షలో భాగంగా ఆయన కేవలం పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకోనున్నారు. వారాహి దీక్షలో భాగంగానే పవన్ కల్యాణ్ తమ ఇలవేల్పు అయిన ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ముందు కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు పవన్. తన ప్రచార రథం వారాహికి కొండగట్టులోనే పూజలు చేయించి అక్కడి నుంచి వారాహి విజయ యాత్రను మొదలు పెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో పవన్ మరోసారి కొండగట్టు అంజన్నను దర్శించుకుంటున్నారు. కొండగట్టు అంజన్నను దర్శించుకున్న అనంతరం పవన్ పిఠాపురం వెళ్లనున్నారు. జులై 1 నుంచి మూడు రోజులపాటు నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోనున్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు పిఠాపురంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Read Also : Kenya violence: కెన్యాలో ఉద్రిక్త పరిస్థితులు.. భారతీయులు జాగ్రత్తగా ఉండాలని సూచన..!