Actor Balakrishna: కేర్ ఆస్పత్రిలో చేరిన నందమూరి బాలకృష్ణ
నందమూరి నటసింహం బాలకృష్ణ కేర్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.
- Author : Hashtag U
Date : 02-11-2021 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ కేర్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆరు నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న బాలయ్య. కొన్ని రోజులుగా ఈయన భుజం నొప్పి కారణంగా బాధ పడుతున్నారు.
తేదీన చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి వెళ్లారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రఘువీర్‌రెడ్డి, డాక్టర్ బి.ఎన్.ప్రసాద్‌ల బృందం 4 గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేశారు. ఈ విషయం అధికారికంగానూ ప్రకటించారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. అయితే అభిమానులు కంగారు పడతారని ముందుగా ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఒకేసారి సర్జరీ పూర్తైన తర్వాత బాలయ్య హాస్పిటల్ విషయం బయటికి వచ్చింది.