BRS : హరీష్ రావు.. బీఆర్ఎస్ లో నీ సీటు ఉంటుందో ఊడుతుందో చూసుకో – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
BRS : “పది సంవత్సరాల పాలనలో ఒక రోజైనా సెక్రటేరియట్ కు రాని మీ మామపై నోరు ఎత్తని మీరు, రోజుకు 18 గంటలు పనిచేసే సీఎం రేవంత్ రెడ్డి పై తప్పుడు ఆరోపణలు చేయడం తగదు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
- By Sudheer Published Date - 09:03 PM, Tue - 13 May 25

తెలంగాణ(Telangana)లో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. బీఆర్ఎస్ నేత హరీష్ రావు (Harishrao ) వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) తీవ్రంగా స్పందించారు. “బీఆర్ఎస్ (BRS) లో నీ సీటు ఉంటుందో ఊడుతుందో ముందు చూసుకో” అంటూ హరీష్ రావును ఉద్దేశించి సూటిగా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ లో తన స్థానం ఏమిటో తెలియక హరీష్ రావు అసహనంతో ఉండటం వల్లే సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు మేలు చేసే పాలన చూసి ఓర్వలేకపోతున్నారు అని వ్యాఖ్యానించారు.
Paritala Sreeram: సీతారాంపల్లి దాబా ఇష్యూపై.. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం రైతులు సంతోషంగా ఉన్నా పరిస్థితిని చూడలేని హరీష్ రావు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు మద్దతుగా కీలక నిర్ణయాలు తీసుకుంటుండగా, అది మాజీ మంత్రి హరీష్ రావుకు మింగుడు పడట్లేదని అన్నారు. పాలన అనేది విమర్శలకోసమేగా కాదు, పని చేయడానికేనని గుర్తుచేశారు. “పది సంవత్సరాల పాలనలో ఒక రోజైనా సెక్రటేరియట్ కు రాని మీ మామపై నోరు ఎత్తని మీరు, రోజుకు 18 గంటలు పనిచేసే సీఎం రేవంత్ రెడ్డి పై తప్పుడు ఆరోపణలు చేయడం తగదు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇక బీఆర్ఎస్ లో ఇటీవల హరీష్ రావు మీద కొనసాగుతున్న ప్రచారాల నేపథ్యంలో ఆది శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ లోపలి విభేదాలను మరింత బహిరంగంగా చేశాయి. పార్టీ నాయకత్వంపై, హరీష్ రావు భవిష్యత్తుపై వస్తున్న వార్తలు కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి . శ్రీనివాస్ వ్యాఖ్యలపై హరీష్ రావు రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.