Leopard : మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత కలకలం
Leopard : అసలు నగరం నడిబొడ్డుకు చిరుత ఎలా వచ్చింది..? ఎక్కడినుండి వచ్చింది..? ఇంత భారీ జనాల మధ్యకు ఎలా వచ్చి ఉంటుంది..?
- Author : Sudheer
Date : 18-10-2024 - 9:40 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ (Hyderabad) నడిబొడ్డున చిరుత పులి (Leopard) సమాచారం కలకలం రేపింది. మియాపూర్ మెట్రో స్టేషన్ (Miyapur Metro Station) వెనకాల నడిగడ్డ తండా ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన స్థానికులు మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు , అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు . అసలు నగరం నడిబొడ్డుకు చిరుత ఎలా వచ్చింది..? ఎక్కడినుండి వచ్చింది..? ఇంత భారీ జనాల మధ్యకు ఎలా వచ్చి ఉంటుంది..? దానిని ప్రజలు చూడకుండా ఎలా ఉన్నారు..? అంటూ నగరవాసులు మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఒక్కటి మాత్రమే ఉందా.. దీనితో పాటు ఇంకా చిరుతలు ఉన్నాయా అనేది ఆందోళనగా మారింది. ప్రస్తుతం ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావద్దని అధికారులు సూచించారు. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఎవరికైనా అది కంటపడితే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు. ప్రస్తుతం చిరుత సంచరిస్తున్న వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర చిరుత సంచారం#viral #miyapur #hyderabad #hyderabadnews #viralvideo #leopard #telangana pic.twitter.com/bl3sWHho21
— Vishal B (@NaniVishal6) October 18, 2024
Read Also : Nara Lokesh : స్కూళ్లకు రూ.100 కోట్ల నిధులు – లోకేష్