Hyderabad : హైదరాబాద్‌లోని ఓ హోటల్ బిర్యాని తిన్న బాలుడు మృతి
లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో కొన్న బిర్యానీ తిని 13 ఏళ్ల బాలుడు వారం రోజుల క్రితం మృతి చెందిన
- By Prasad Published Date - 09:02 AM, Sat - 20 August 22

హైదరాబాద్: లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో కొన్న బిర్యానీ తిని 13 ఏళ్ల బాలుడు వారం రోజుల క్రితం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన శుక్రవారమే వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌లో నివాసం ఉంటున్న కుటుంబం ఆగస్టు 13న లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో బిర్యానీ కొని రాత్రి భోజనం చేసింది. సూర్యాపేట నుండి తిరిగి వచ్చినప్పుడు బిర్యానీని కొనుగోలు చేశారు. వారు ఇంటికి వెళ్లి రాత్రి భోజనం చేసారు. ఆ తర్వాత మరుసటి మధ్యాహ్నం వరకు బాలుడు సృహకోల్పోయాడు. దీంతో బాలుడిని చనిపోయినట్లు గుర్తించారని సైఫాబాద్ పోలీసు అధికారి తెలిపారు. కుటుంబంలోని వ్యక్తి అతని కుమార్తె కూడా అస్వస్థతకు గురైయ్యారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించి బాలుడి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. బిర్యానీ నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. నివేదికల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సూర్యాపేట నుంచి తిరిగి వచ్చిన తర్వాత నిద్రపోయే ముందు బిర్యానీ మాత్రమే తిన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫుడ్ పాయిజన్ వల్లే తమ కొడుకు చనిపోయాడని ఆరోపించారు.