Whatsapp: షాకిచ్చిన వాట్సాప్.. ఇక పై ఈ పనులు అస్సలు చేయలేరు?
నిత్యం లక్షలాది మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్. చాటింగ్ చేసుకోవడానికి వీడియో కాల్స్ వాయిస్ కాల్స్
- By Nakshatra Published Date - 06:10 PM, Tue - 18 October 22
నిత్యం లక్షలాది మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్. చాటింగ్ చేసుకోవడానికి వీడియో కాల్స్ వాయిస్ కాల్స్ ఇలా ఎన్నో విషయాలు కోసం వాట్సాప్ ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న వాటిలో వాట్సాప్ కూడా ఒకటి. ఇది ఇలా ఉంటే వాట్సప్ సంస్థ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజులుగా ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. వాట్సాప్ నుంచి రాబోతున్న కొత్త ఫీచర్ల గురించి చర్చలు జోరుగా వినిపిస్తున్నాయి.
మరి ఆ ఫీచర్లు ఏంటో దాని వల్ల ఎటువంటి ఉపయోగమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాట్సాప్ లో ఎడిట్ అని ఆప్షన్ యూజర్స్ ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ ఎడిట్ మెసేజ్ ఫీచర్ గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. త్వరలోనే వాట్సాప్ సంస్థ ఈ ఎడిట్ మెసేజ్ అనే ఫీచర్ ని తీసుకురానుంది. అయితే ఎప్పుడుపడితే అప్పుడు ఎడిట్ చేసే అవకాశం ఉండదని కేవలం మెసేజ్ చేసిన 15 నిమిషాల లోపు ఎడిట్ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటివరకు వాట్సాప్లో ఫొటోలు, వీడియోలను సెండ్ చేసుకునే సమయంలో వాటికి క్యాప్షన్ ని జోడించి పంపిస్తాం.
కానీ ఇక పై మీరు వేరే వాళ్లకు సెండ్ చేసే డాక్యుమెంట్కి కూడా క్యాప్షన్ పెట్టి పంపవచ్చు. వాట్సాప్ గ్రూపులో కేవలం 512 మంది మాత్రమే ఉండేలా వీలును కల్పించిన వాట్సాప్ సంస్థ తాజాగా దానిని డబుల్ చేస్తూ 1024 మంది ఒకటే వాట్సాప్ గ్రూప్ లో ఉండే విధంగా వీలును కల్పించింది. ఇకపై వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీయడానికి ఉండదట. వాట్సాప్ లో ఎవరైనా చాటింగ్ చేసిన తర్వాత మెసేజ్లను డిలీట్ చేస్తారు అన్న అనుమానం తో ముందుగా స్క్రీన్ షాట్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు యూజర్ గనుక వద్దు అనుకుంటే ఇకపై మీరు వారి చాటింగ్ స్క్రీన్ షాట్స్ తీసే అవకాశం ఉండదు. ఇలా స్క్రీన్ షాట్స్ తీసుకోకుండా ఉండేలా చేయాలంటే యూజర్లు వ్యూవ్ వన్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. అలా సెలక్ట్ చేసుకుంటే మీ చాటింగ్ని స్క్రీన్ షాట్స్ తీసుకోలేరు. కానీ ఈ ఆప్షన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుంది అన్న విషయం ఇంకా తెలియలేదు.
Related News
Sonu Sood WhatsApp: యాక్టీవ్ మోడ్ లో సోనూసూద్ వాట్సాప్ అకౌంట్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ గత రెండు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వాస్తవానికి అతని వాట్సాప్ ఖాతా బ్లాక్ అయింది. దీని కారణంగా సోనూ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే 61 గంటల తర్వాత అతని వాట్సాప్ ఖాతా మళ్లీ యాక్టివ్గా మారింది.