Zomato CEO: డెలివరీ బాయ్‌గా జొమాటో సీఈఓ.. ఊహించని షాక్..!
- By Kode Mohan Sai Published Date - 12:47 PM, Mon - 7 October 24

డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ డెలివరీ బాయ్‌గా వెళ్లారు. అయితే, ఓ మాల్‌లో ఆర్డర్‌ను కలెక్ట్ చేసుకునే సమయంలో ఆయనకు ఒక విచిత్ర అనుభవం ఎదురైంది.
మాల్‌లోని సెక్యూరిటీ సిబ్బంది దీపిందర్‌ను లిఫ్ట్‌లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. చేసేదేంలేక, ఆయన మూడో అంతస్తుకు మెట్ల మార్గం ద్వారా వెళ్లి ఆర్డర్ తీసుకున్నారు. ఈ అనుభవాన్ని ప్రజలకు తెలియజేస్తూ, ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్టు చేశారు.
During my second order, I realised that we need to work with malls more closely to improve working conditions for all delivery partners. And malls also need to be more humane to delivery partners.
What do you think? pic.twitter.com/vgccgyH8oE
— Deepinder Goyal (@deepigoyal) October 6, 2024
ఈ సంఘటన ద్వారా డెలివరీ బాయ్స్ సంక్షేమం దృష్ట్యా, మాల్స్‌తో కలిసి జొమాటో మరింత సాన్నిహిత్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించారు. దీనిపై నెటిజన్‌ల అభిప్రాయాలను అడిగి, వారు ఏమనుకుంటున్నారో తెలియజేయాలని కోరారు.