Viral Tweet: పబ్ లో రచ్చ చేస్తోన్న ఆర్ఆర్ఆర్…ఫొటో షేర్ చేసిన విజయసాయిరెడ్డి…!!
వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతిపక్షాలపై సెటైర్లు విసరడంలో చాలా చురుకుగా ఉంటాయి.
- By hashtagu Published Date - 03:13 PM, Tue - 14 June 22

వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతిపక్షాలపై సెటైర్లు విసరడంలో చాలా చురుకుగా ఉంటాయి. అయితే తాజాగా వైసీపీ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజుపై ఓ రేంజ్ లో సెటైర్ విసిరారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు…పబ్ లో పెగ్ ఏస్తున్న ఫొటోను తాజాగా విజయసాయి రెడ్డి షేర్ చేశారు.
పట్టపగలే తప్పతాగి మధ్యాహ్నం 1గంటలకు నాలుగు పచ్చకుల మీడియా మైకుల ముందు మత్తుదిగేదాకా మొరగడం విగ్గురాజు పని. ఒకసారి నియోజకవర్గంలో ఓట్లు వేసిన వారి వద్దకు వెళ్తే బయటపడుతుంది నర్సాపురం నక్కా అసలు రంగు. నీలి రంగు నక్కగతే పడుతుంది అంటూ ఓ సంచలన ట్వీట్ చేశారు. పచ్చ మీడియా, చంద్రబాబు, నారా లోకేశ్ లాంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం చేకూరేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పట్టపగలే తప్పతాగి మధ్యాహ్నం ఒంటి గంటకు నాలుగు పచ్చ కుల మీడియా మైకుల ముందు మత్తు దిగేదాకా మొరగడం విగ్గు/పెగ్గు రాజు పని. ఒకసారి నియోజకవర్గంలో ఓట్లు వేసిన వారి దగ్గరకు వెళ్తే బయటపడుతుంది నర్సాపురం నక్క అసలు రంగు. 'నీలి రంగు నక్కగతే పడుతుంది'. pic.twitter.com/04u9QkWpi5
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 13, 2022