YCP MLA: జగన్ గెంటేసినా ఆయన వెంటే ఉంటా: అనిల్ కుమార్ యాదవ్
పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
- By Balu J Published Date - 06:31 PM, Thu - 18 May 23

తను పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) అన్నారు. తనకు మోకాలి నొప్పి ఉందని, దాని ట్రీట్ మెంట్ కోసం 15రోజులు నెల్లూరులో ఉండటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎవరెన్ని చేసినా.. తను సీఎం జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. నేనే వేరే పార్టీలో ఉండలేనని, వైసీపీ (YCP) లో ఉంటానని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. జగన్ గెంటేసినా, తరిమివేసినా ఆయన వెంట అని ఆయన అన్నారు. నా రాజకీయ భవిష్యత్తు నెల్లూరు ప్రజలు, జగన్ రెడ్డి మీద ఆధారపడి ఉందని ఆయన అన్నారు. వారు ఏదీ నిర్ణయిస్తే అదే జరుగుతుందని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
Also Read: Mohammed Siraj Dream: టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ కొత్త ఇల్లును చూశారా!