Coffin: శవపేటికలో నుంచి లేచిన బామ్మ.. కానీ చివరికి మాత్రం అలా?
మాములుగా అప్పుడప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరిచే విధంగా ఆనం
- By Anshu Published Date - 03:06 PM, Mon - 19 June 23

మాములుగా అప్పుడప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరిచే విధంగా ఆనందపరిచే విధంగా ఉంటాయి. కొన్ని సంఘటనలు అప్పుడే నవ్వులు తెప్పించి అప్పుడు ఏడుపులు తెప్పించే విధంగా కూడా ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. చనిపోయింది అనుకొని సమాధి చేస్తున్న దశలో ఒక వృద్ధురాలు శివపేటికలో నుంచి తట్టింది. అది గమనించిన బంధువులు ఒక్కసారిగా అవాక్కయి ఆమె బతుకుంది అన్న విషయాన్ని గ్రహించి వెంటనే ఆస్పత్రికి తరలించారు.
అయితే అక్కడ ఐసీయూలో వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆ వృద్ధురాలు చివరకు ప్రాణాలు కోల్పోయింది. అసలేం జరిగిందంటే.. ఈక్వెడార్ లోని బాబాహోయో నగరానికి చెందిన బెల్లా మోంటాయ అనే 76 ఏళ్ళ వృద్ధురాలికి ఇటీవల గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు. మరణధ్రువీకరణ పత్రం కూడా అందజేశారు. దీంతో మృతదేహాన్ని తీసుకెళ్లిన కుటుంబీకులు శవపేటికలో ఉంచి అంత్యక్రియల కోసం సిద్ధం చేశారు.
ఈ క్రమంలోనే సుమారు ఐదుగంటలు గడిచిన తర్వాత శవపేటిక లోపలి నుంచి ఎవరో తడుతున్నట్లు శబ్దం వస్తుండటంతో అక్కడున్న వారు మొదట కంగారు పడ్డారు. దాన్ని తెరచిచూడగా వృద్ధురాలు బతికే ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. వీటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. అయితే, ఈ ఘటన పై ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది. ఇదే సమయంలో ఆ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.