South Carolina: ఇదేందయ్యా ఇది.. ఇంటి అద్దె భరించలేక విమానంలో ఉద్యోగానికి వెళుతున్న యువతి?
మామూలుగా ఇంటి అద్దె పెరిగినప్పుడు మరొక ఇంటిని చూసుకోవడం లేదంటే ఆదాయ మార్గాన్ని ఆదాయాన్ని పెంచుకోవడం లాంటివి చేస్తుంటారు. కానీ ఒక యువతి చేసి
- By Nakshatra Published Date - 06:30 PM, Mon - 19 June 23
మామూలుగా ఇంటి అద్దె పెరిగినప్పుడు మరొక ఇంటిని చూసుకోవడం లేదంటే ఆదాయ మార్గాన్ని ఆదాయాన్ని పెంచుకోవడం లాంటివి చేస్తుంటారు. కానీ ఒక యువతి చేసిన పనికి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఒక యువతి ఇంటి అద్దె భరించలేక అభిమానంలో ఉద్యోగానికి మరొక రాష్ట్రానికి వెళ్ళొస్తోంది. అదేంటి ఇంటి అద్దె కంటే విమానం చార్జీలు అంత తక్కువ అన్న అనుమానం మీకు రావచ్చు. వినడానికి కాస్త విడ్డురంగా ఉంది కదూ. పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌత్ కరోలినా లోని కార్లెస్టన్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల సోఫియా సెలెంటానో యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియాలో చదువుతోంది.
వేసవి సెలవులకు కార్లెస్టన్కు వచ్చిన ఆమెకు న్యూజెర్సీ లోని ఒగిలివ్ హెల్త్ అనే అడ్వర్టైజింగ్ సంస్థలో సమ్మర్ ఇంటర్న్షిప్ చేసే అవకాశం లభించింది. అయితే న్యూజెర్సీలో ఇంటి అద్దెలు చాలా ఎక్కువ. శివారు ప్రాంతాల్లో ఉండాలన్న కనీసం నెలకు 3400 డాలర్లు చెల్లించాలి. అయితే, రెండునెలల తన ఇంటర్న్షిప్ కాలంలో సోఫియా వారానికి ఒక రోజే ఆఫీసుకు వెళ్లాలట. దీంతో అద్దెలు భరించలేని ఆమె వినూత్న ఆలోచన చేసింది. కార్లెస్టన్ నుంచి దాదాపు 700 కి.మీ దూరంలో ఉన్న న్యూజెర్సీకి వారానికి ఒక రోజు విమానంలో వెళ్తోంది.
రెండు నెలల్లో మొత్తంగా 8 రోజులు ఆమె ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా అందుకు విమాన టికెట్, క్యాబ్ ఖర్చులు అంతా కలిపి 2,250 డాలర్లే ఖర్చవుతుందట. న్యూజెర్సీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉండటం కంటే.. తన ఇంటి నుంచే వెళ్లడం మంచిదని భావించిన సోఫియా విమాన ప్రయాణం చేస్తోంది. అయితే, ఇందుకోసం తాను తెల్లవారుజాము 3 గంటలకే లేవాల్సి వస్తోందని, రాత్రి పొద్దుపోయాక ఇల్లు చేరుతున్నట్లు ఆమె తెలిపింది. కాగా ఇదే విషయాన్ని సోఫియా ఇటీవల తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఆమె జర్నీ కథ తెలుసుకున్న నెటిజన్లు అవాక్కవుతున్నారు.
Related News
Air India: విమానం నుంచి దూకేస్తానని వ్యక్తి నానా హంగామా
ఎయిరిండియా విమానంలో నుంచి దూకేస్తానని బెదిరించిన కన్నూర్కు చెందిన వ్యక్తిని మమ్మగలూరులో అరెస్టు చేశారు. ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. వివరాలలోకి వెళితే..