Wild Hunt: గోల్ఫ్ కోర్సులో క్రూర జంతువుల వేట.. వైరల్ వీడియో?
సాధారణంగా మనం మైదానాలలో గోల్ఫ్ ఆడుతూ ఉండటాన్ని చూసే ఉంటాం. కొంతమంది గోల్డ్ పుని ఆడి ఉంటారు. ఈ
- By Anshu Published Date - 04:38 PM, Tue - 30 August 22

సాధారణంగా మనం మైదానాలలో గోల్ఫ్ ఆడుతూ ఉండటాన్ని చూసే ఉంటాం. కొంతమంది గోల్డ్ పుని ఆడి ఉంటారు. ఈ గోల్ఫ్ మైదానాలు విశాలంగా శుభ్రంగా ఉంటాయి. అయితే వీటిని మామూలుగా ఏదైనా ప్లే గ్రౌండ్ లలో ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ ప్లేగ్రౌండ్ లోకి మనుషులు తప్ప జంతువులు ఎంట్రీ ఉండదు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో మాత్రం గోల్డ్ మైదానంలో మనుషులు కాకుండా జంతువులు గోల్స్ ఆడుతున్నాయి. గోల్ప్ మైదానంలో జంతువులు ఆడటం ఏంటి అనుకుంటున్నారా మీరు విన్నది నిజమే. పూర్తి వివరాల్లోకి వెళితే..
దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్ నడిమధ్యన ఉన్న స్కుకుజా గోల్ఫ్ క్లబ్‌లో తాజాగా కొందరు ఆటగాళ్లు గోల్ఫ్ ఆడుతున్నారు. ఇంతలోనే వారి ఆటకు కొన్ని క్రూర మృగాలు బ్రేక్ వేశాయి. కాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే అడవికి ఆ గోల్ఫ్ మైదానానికి మధ్య ఎటువంటి రక్షణ కంచే లేకపోవడం వల్ల ఆ జంతువులు ఆ విధంగా తరచుగా ఆ గోల్ఫ్ మైదానంలోకి వస్తుంటాయట. అక్కడ ఉన్న ఆ గోల్ఫ్‌కోర్స్‌లో ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి గుంటల్లో దప్పిక తీర్చుకొనేందుకు జిరాఫీలతో పాటు చిరుత పులులు, ఖడ్గ మృగాలు, ఏనుగులు, అడవి దున్నలు వంటి భయంకరమైన జంతువులు క్రూర జంతువులు కూడా అక్కడికి వస్తుంటాయట.
అందుకే అక్కడ గోల్ఫ్ ఆడాలనుకొనే ఆటగాళ్లకు ఎంతో గుండెధైర్యం కావాలి. అయితే కేవలం అదొక్కటే కాదండోయ్ అడవి జంతువులు ఏవైనా దాడి చేసి చంపేస్తే క్లబ్ నిర్వాహకుల బాధ్యత ఏమి లేదంటూ అగ్రిమెంట్ పై సంతకం చేసిన వారినే ఇందులోకి అనుమతిస్తారట. కాగా ఈ క్రూగర్ నేషనల్ పార్క్ సిబ్బంది కోసం 1972 లో ఈ గోల్ఫ్‌కోర్స్‌ను ఏర్పాటు చేసారు. ఆ తర్వాత క్రమంగా స్థానికులతో పాటుగా అక్కడికి,పర్యాటకులకు కూడా ఇందులో ఆడేందుకు అవకాశం కల్పించారు. అందుకే దీన్ని ప్రపంచంలోకెల్లా అత్యంత కఠినమైన, క్రూరమైన గోల్ఫ్‌కోర్స్‌గా పిలుస్తున్నారు.